నాలుగో రోజు ఖుషి మూవీ కలెక్షన్లు ఇంత ఘోరమా.. విజయ్, సమంతలకు భారీ షాక్ తగిలిందా?

విజయ్ దేవరకొండ, ( Vijay Deverakonda )సమంత కాంబినేషన్ లో తెరకెక్కిన ఖుషి మూవీ మొదటి మూడు రోజులు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించింది.

అయితే వీకెండ్ లో అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్లను సాధించిన ఖుషి మూవీ వీక్ డేస్ లో మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడంలో ఫెయిలైంది.

సోమవారం రోజు ఖుషి మూవీ కలెక్షన్లు కోటి రూపాయల షేర్ కలెక్షన్లకు అటూఇటుగా ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో వర్షాలు పడుతుండటం కూడా ఖుషి మూవీ ( kushi movie )కలెక్షన్లపై ప్రభావం చూపుతోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటంగమనార్హం.విజయ్, సమంతలకు భారీ షాక్ తగిలిందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.వర్షాలు తగ్గితే మాత్రమే ఖుషి కలెక్షన్లు మరింత పుంజుకునే అవకాశాలు ఉన్నాయి.

సెకండ్ వీక్ కలెక్షన్లను బట్టి ఈ సినిమా తుది ఫలితం తేలే అవకాశం ఉంటుంది.విజయ్, సమంత( Samantha ) కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని ఈ జోడీ అద్భుతంగా ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

విజయ్, సామ్ ఖుషి సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి రావడంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.విజయ్, సామ్ ఖుషి సినిమా పాజిటివ్ రిజల్ట్ తో తర్వాత సినిమాల కథల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

త్వరలో విజయ్ దేవరకొండ కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని తెలుస్తోంది.

విజయ్ ఇతర భాషల్లో కూడా సక్సెస్ సాధించే దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సమంత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చే క్షణం కోసం ఎదురుచూస్తున్నామని కామెంట్లు వినిపిస్తున్నాయి.విజయ్, సామ్ కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఖుషి సినిమాలో ఫస్టాఫ్ అద్భుతంగా ఉండగా సెకండాఫ్ విషయంలో కొన్ని పొరపాట్లు జరిగాయి.ఆ పొరపాట్లను సరిదిద్దుకుని ఉంటే ఈ సినిమా రేంజ్ మరింత పెరిగేది.

చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!
Advertisement

తాజా వార్తలు