ఒక అధికారి అడిగిన లంచం ఇచ్చేందుకు బిక్షమెత్తిన రైతు.. పరిస్థితి ఇలా ఉంటే దేశం ఎలా బాగుపడుతుంది

ప్రభుత్వ ఆఫీస్‌లలో లంచం ఇస్తే కాని పని జరగదు అంటారు.ప్రభుత్వ ఆఫీస్‌లు అంతా కూడా అవినీతిమయం అని అంతా అంటూ ఉంటారు.

తాజాగా జరిగిన ఒక సంఘటన మరోసారి ఇండియాలో అవినీతి ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెప్పింది.ఈ స్థాయిలో అవినీతి ఉంటే ఇంకేం అభివృద్ది జరుగుతుంది.

అవినీతి లేని దేశమే అభివృద్దిలో ముందుకు సాగుతుంది.ఇండియాలో కూడా ఎప్పుడైతే అవినీతి పూర్తిగా తగ్గి పోతుందో అప్పుడే అభివృద్ది జరుగుతుంది.

అయితే ఇండియాలో అవినీతి అనేది పూర్తిగా తగ్గం అనేది అసాధ్యం అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

Advertisement

తాజాగా ఒక రైతు ప్రభుత్వ అధికారి అడిగిన లంచం డబ్బులను ఇచ్చేందుకు ఏకంగా భిక్షాటన చేయాల్సి వచ్చింది.భూమికి సంబంధించిన ఒక వివాదంను పరిష్కరించేందుకు రైతు ప్రభుత్వ అధికారి వద్దకు వెళ్లాడు.ఆయన పది వేల రూపాయల లంచం డిమాండ్‌ చేశాడట.

తినడానికి కూడా సరిగా డబ్బు లేని ఆ రైతు తన పొలం కోసం కుటుంబ సభ్యలతో రోడ్లమీద బిక్షాటన చేసేందుకు సిద్దం అయ్యాడు.రోడ్డు మీద బిక్ష ఎత్తిన రైతు గురించి తెలిసిన జనాలు షాక్‌ అయ్యారు.

ఈ సంఘటన మరెక్కడో కాదు ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగింది.

రైతును బిక్షం ఎత్తుకునేలా చేసిన ప్రభుత్వ అధికారిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అయ్యాయి.రైతుకు మద్దతుగా కొన్ని వందల మంది ముందుకు వచ్చారు.ఏసీబి అధికారులు కూడా రైతుకు న్యాయం చేసేందుకు ముందుకు వచ్చారు.

ప్రభాస్ తో సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్...
తొలి ప్రయత్నంలో ఫెయిల్.. రెండో ప్రయత్నంలో ఐఎఫ్ఎస్ ఫస్ట్ ర్యాంక్.. రిత్విక సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

రైతు నుండి లంచం అడిగినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను ఏసీబి ప్రశ్నించింది.ఏసీబీ విచారణలో సదరు అధికారి తాను లంచం అడగలేదు అంటున్నాడు.

Advertisement

ఈ కేసు విచారణ జరుగుతుంది.

ఈ అవినీతి ఎన్నటికి తగ్గుతుందో, దేశం ఎప్పుడు బాగుపడుతుందో అంటూ జనాలు ఎదురు చూస్తున్నారు.కాని ఇదే జనాలు ఏదైనా పని కావాలంటే వెంటనే ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు.జనాలు లంచాలు ఇవ్వడం మానేసినప్పుడే దేశంలో అవినీతి అనేది తగ్గుతుంది.

తాజా వార్తలు