లోకేష్ తో రెగ్యులర్ గా మాట్లాడుతూనే ఉంటా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!!

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో మంత్రి కేటీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు.

ఒకపక్క బహిరంగ సభలలో పాల్గొంటూ మరోపక్క ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ తో పాటు వెబ్ మీడియా ఛానల్స్ కి కూడా వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

ఈ క్రమంలో చంద్రబాబు అరెస్ట్( Chandrababu arrest ) గురించి ఓ వెబ్ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు అరెస్టు అయిన సమయంలో తెలంగాణలో ధర్నాలు.

KTR Keeps Talking To Lokesh Regularly KTR, Lokesh, Chandrababu, Chandrababu Arre

నిరసనలు తెలుపుతుండగా.కేటీఆర్ అక్కడ అరెస్ట్ అయితే ఇక్కడ.

నిరసనలు తెలియజేయడమేంటని కామెంట్లు చేశారు.ఈ వ్యాఖ్యలపై ప్రశ్న వేయగా చంద్రబాబు అరెస్ట్ పూర్తిగా రాజకీయ శత్రుత్వంతో కూడుకున్నది.

Advertisement

దీంతో దాని గురించి తెలంగాణలో నిరసనలు తెలియజేస్తే ఇక్కడ గొడవలు జరిగే అవకాశం ఉంది.అందుకే నేను వద్దని చెప్పాను అని కేటీఆర్ స్పష్టం చేశారు.

ఆ సమయంలో నేను చెప్పిన విధానం బాగోలేదేమో కానీ ఉద్దేశం మాత్రం అదేనని క్లారిటీ ఇచ్చారు.నేను లోకేష్ రెగ్యులర్ గా మాట్లాడుకుంటాం.

అదేవిధంగా జగన్, పవన్ లతో కూడా నాకు మంచి స్నేహ సంబంధం ఉంది.రాజకీయాలు వేరు స్నేహం వేరు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ఆ ఆరు దేశాల్లోని భారతీయులకు వీసా ఆన్ అరైవల్ ఎంట్రీ .. యూఏఈ కీలక నిర్ణయం
Advertisement

తాజా వార్తలు