ఆ మూవీలో రవితేజ నటనను చూసి గర్వపడ్డా.. కోట షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరోగా రవితేజకు మంచి గుర్తింపు ఉంది.రవితేజ ఈ స్థాయికి చేరుకోవడానికి పడిన కష్టం అంతాఇంతా కాదు.

ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు రవితేజ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.కోట శ్రీనివాసరావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డైరెక్టర్ గా రాఘవేంద్ర రావు అంటే ఏ విధంగా ఇష్టమో రవితేజను కూడా అదే విధంగా ఇష్టపడతానని ఆయన అన్నారు.

జెన్యూన్ గా కష్టపడే హీరోలలో రవితేజ ఒకరని కోట శ్రీనివాసరావు వెల్లడించారు.రవితేజకు అతని సామర్థ్యం గురించి బాగా తెలుసని కథలను సరిగ్గా జడ్జ్ చేసే హీరోలలో రవితేజ ఒకరని కోట శ్రీనివాసరావు కామెంట్లు చేశారు.

ఇడియట్ సినిమాలో నేను పోలీస్ ఆఫీసర్ గా రవితేజ నా కొడుకు రోల్ లో నటించాడని కోట శ్రీనివాసరావు వెల్లడించారు.ఆ సినిమాలో నీకు సిగ్గు కూడా ఉందా అని రవితేజను తిడతానని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.

Advertisement
Kota Sreenivasarao Comments About Raviteja Acting Goes Viral Details, Kota Srini

మధ్యతరగతి తండ్రి గురించి ప్రతిబింబించే విధంగా ఆ సీన్ ఉంటుందని కోట శ్రీనివాసరావు కామెంట్లు చేశారు.

Kota Sreenivasarao Comments About Raviteja Acting Goes Viral Details, Kota Srini

ప్రతి ఇంట్లో అలాంటి సీన్లు జరుగుతాయని కొడుకును తల్లి వెనకేసుకొని వస్తుందని కోట శ్రీనివాసరావు కామెంట్లు చేశారు.రవితేజను నటుడిగా చూసి గర్వపడిన సినిమా అది అని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.ఇడియట్ మూవీలో సెంటిమెంట్ సీన్లు కూడా బాగుంటాయని కోట శ్రీనివాసరావు వెల్లడించారు.

Kota Sreenivasarao Comments About Raviteja Acting Goes Viral Details, Kota Srini

ఇడియట్ సినిమాలోని ప్రతి సన్నివేశంలో రవితేజ చాలా న్యాచురల్ గా నటించాడని రవితేజ స్నేహితులను కొట్టే సీన్, రవితేజ ఫ్రెండ్స్ ను చెంబుతో కొట్టే సీన్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయని కోట కామెంట్లు చేశారు.సినిమాలోని ఈ సీన్లు ఎంతో బాగుంటాయని ఆయన తెలిపారు.కోట చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!
Advertisement

తాజా వార్తలు