30 ఏళ్ల కుర్రాడిగా చిరును చూపించేందుకు దర్శకుడి ప్రయత్నం వర్కౌట్‌ అయ్యేనా?

చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి సందడి పూర్తి అయ్యింది.

ఇక ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న చిరు 152వ చిత్రం ప్రారంభంకు రంగం సిద్దం అయ్యింది.

అత్యధిక బడ్జెట్‌తో కాకుండా ఒక సింపుల్‌ బడ్జెట్‌తో రామ్‌ చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు మొదలు పెట్టాడు.కొరటాల శివ గత చిత్రాల్లో ఏ ఒక్కటి కూడా ఫ్లాప్‌ అవ్వలేదు.

ఆ కారణంగానే ఆయన ఈ చిత్రం కూడా మరో సక్సెస్‌ను దక్కించుకుంటాడు అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు.

భారీ ఎత్తున అంచనాలున్న మెగా 152 చిత్రం గురించి రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి.ఎప్పుడెప్పుడు ఈ చిత్రం వస్తుందా అంటూ మెగా ఫ్యాన్స్‌ ఎదురు చూసేలా మీడియాలో వార్తలు వస్తున్నాయి.తాజాగా మరో ఆసక్తికర వార్త ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Advertisement

అదేంటీ అంటే ఈ చిత్రంలో చిరంజీవి రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు.ఒక పాత్రలో ఏజ్డ్‌ వ్యక్తిగా కనిపించబోతున్నాడు, ఇక రెండవ పాత్రలో యంగ్‌ మన్‌గా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఆరు పదుల వయసు దాటిన చిరంజీవి మొదటి పాత్రకు పూర్తి న్యాయం చేస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.కాని రెండవ పాత్ర అయిన యంగ్‌ మన్‌ పాత్రను చిరంజీవి ఏమేరకు సమర్ధవంతంగా చేస్తాడు అనేది అనుమానమే.ఎందుకంటే ఆరు పదుల వయసు ఉన్న వ్యక్తి మూడు పదుల వయసు వ్యక్తిగా కనిపించడం అంటే అది దాదాపుగా అసాధ్యం అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కాని కొరటాల ఏం చేసినా కూడా వర్కౌట్‌ అయ్యేలా చేస్తాడు.అందుకే ఈ సినిమా కూడా తప్పకుండా ఆకట్టుకుంటుందని నమ్ముదాం.

వేరే హీరో రిజెక్ట్ చేసిన కథలతో సినిమాలు చేస్తున్న విజయ్ దేవరకొండ...
Advertisement

తాజా వార్తలు