బన్నీ పై ట్రోల్స్.. దీనికి ఆయన ఏం సమాధానం చెప్తాడో?

అల్లు అర్జున్‌ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో పుష్ప చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ఇంకా ప్రారంభం కాలేదు.

ముందుగా అనుకున్న ప్రకారం అయితే సినిమా షూటింగ్‌ ఇప్పటికే సగం వరకు పూర్తి అవ్వాల్సి ఉంది.కరోనా కారణంగా సినిమా షూటింగ్‌ ప్రారంభం కాలేదు.

ఈ ఏడాది చివరి వరకు అయినా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారో లేదో తెలియదు.ఇలాంటి సమయంలో బన్నీ తదుపరి చిత్రం ప్రకటన వచ్చింది.

దాంతో అంతా కూడా ముందు పుష్పను పూర్తి చేయమంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.గత కొన్ని రోజులుగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమాను చేస్తున్నట్లుగా బన్నీ సన్నిహితుల వద్ద చెబుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Advertisement
Allu Arjun And Koratalasiva Movie Updation, Koratala Siva, Allu Arjun, Pushpa, S

అయితే ఆ విషయం నిజం కాకపోవచ్చు అనుకున్నారు.కాని అనూహ్యంగా నేడు అల్లు అర్జున్‌ 21వ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్నాడు అంటూ ప్రకటన వచ్చింది.

ఆచార్య చిత్రం కోసం షూటింగ్‌ కొరటాల వెయిట్‌ చేస్తున్నాడు.సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ లో ఆచార్య చిత్రాన్ని మొదలు పెట్టే అవకాశం ఉంది.

Allu Arjun And Koratalasiva Movie Updation, Koratala Siva, Allu Arjun, Pushpa, S

కొరటాల శివ ప్రస్తుతం బన్నీ కోసం స్క్రిప్ట్‌ వర్క్‌ చేస్తున్నాడు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్టోరీ ఇప్పటికే రెడీ అయ్యింది.కనుక సినిమాను అధికారికంగా ప్రకటించారు.

స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అయిన నేపథ్యంలో ప్రకటన వచ్చింది.అయితే ఇంకా పుష్ప మొదలు పెట్టకుండానే అప్పుడే కొత్త సినిమా ఏంటీ బన్నీ అంటూ కొందరు ట్రోల్స్‌ చేస్తున్నారు.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
కోలీవుడ్ హీరోతో చరణ్ మల్టీస్టారర్ మూవీ... ఖుషి అవుతున్న మెగా ఫాన్స్! 

మరి బన్నీ ఈ ట్రోల్స్ కు ఏం సమాధానం చెప్తాడో చూడాలి.

Advertisement

తాజా వార్తలు