ధనుష్ జగమే తంత్రం మూవీ హిట్టా..? ఫ్లాపా..?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన జగమే తంత్రం సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన సంగతి తెలిసిందే.

ఈ మధ్య కాలంలో ఓటీటీలో రిలీజైన భారీ సినిమా జగమే తంత్రం మాత్రమే అని చెప్పాలి.

నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను 55 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.గతేడాది ఈ సినిమా షూటింగ్ పూర్తైనా వేర్వేరు కారణాల వల్ల వాయిదా పడిన ఈ సినిమా చివరకు ఓటీటీలో విడుదలైంది.

కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.ఈ సినిమా కథ విషయానికి వస్తే వీధి రౌడీ అయిన సురులి(ధనుష్) సెటిల్మెంట్లతో పాటు హత్యలు చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు.

అయితే కొన్ని కారణాల వల్ల సురులి ఊరి విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.అదే టైమ్ లో సురులికి లండన్ నుంచి పీటర్ అనే వ్యక్తి నుంచి పిలుపు వస్తుంది.

Advertisement
Kollywood Star Hero Dhanush Jagame Tantram Movie Result, Jagame Tantram Movie,

గ్యాంగ్ స్టర్ అయిన శివదాస్ తను చేస్తున్న ప్రతి పనికి అడ్డు వస్తుండటంతో పీటర్ శివదాస్ ను చంపించడానికి సురులిని లండన్ కు పిలిపిస్తాడు.

Kollywood Star Hero Dhanush Jagame Tantram Movie Result, Jagame Tantram Movie,

లండన్ కు వచ్చిన సురులి శివదాస్ పతనానికి కారణం కాగా అదే సమయంలో సురులి ఒక సింగర్ తో ప్రేమతో పడతాడు.అయితే ఆ తరువాత సురులిపై హత్యాయత్నం జరగగా అదే సమయంలో శివదాస్ గురించి సురులికి అసలు నిజం చేస్తుంది.ఆ తరువాత తాను చేసిన తప్పును తెలుసుకున్న సురులి ఏం చేశాడనే కథతో ఈ సినిమా తెరకెక్కింది.

ఈ సినిమా కథ బాగానే ఉన్నా కథనం స్లోగా ఉంది.ధనుష్ నటన, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ సినిమాకు హైలెట్ కాగా స్లోగా సాగే కథనం, దర్శత్వంలో లోపాలు సినిమాకు మైనస్ గా మారాయి.

మాస్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను ఈ సినిమా అంతోఇంతో ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి.థియేటర్లలో ఈ సినిమా రిలీజై ఉంటే బిలో యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకునేది.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement

తాజా వార్తలు