దుర్మార్గుడు దొంగ .. రెచ్చిపోయిన కొడాలి నాని

ఎప్పుడు ఏ చిన్న అవకాశం దొరికినా చంద్రబాబు మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉండే వైసీపీ మంత్రి కొడాలి నాని మరోసారి చంద్రబాబు నాయుడు మీద తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు.

తండ్రి లేని అవినాష్ ను గుడివాడలో పోటీకి దింపి బలిపశువిని చేసాడని, అదేవిధంగా వల్లభనేని వంశీని కూడా బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నించారని 74 ఏళ్ల వయసులో ఉన్న ఎన్టీఆర్ ను బ్లాక్ మెయిల్ చేసి మెడ పట్టి బయటికి గెంటి, ముఖ్యమంత్రి పదవిని తీసుకున్న దుర్మార్గుడు, దొంగ.

చంద్రబాబు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు నాని.ఇటువంటి సన్నాసులను భూస్థాపితం చేయడానికి, అన్న ఎన్ టీఆర్ ఆత్మకు శాంతి చేకూర్చడానికి తాను ప్రయత్నం చేస్తానని నాని అన్నారు.

Kodali Nani Sensational Comentss On Chandrababu Naidu-దుర్మార్�

అలాగే తెలుగుదేశం నాయకులను వైసీపీలో చేర్పించే బాధ్యత తనకు జగన్ అప్పగిస్తే చంద్రబాబు, లోకేశ్ మినహా అందరిని వైసీపీలోకి తీసుకువచ్చే బాధ్యత నాది అంటూ వంశీ వ్యాఖ్యానించారు.ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ బతికి బట్టకట్టాలంటే ఎన్టీఆర్ కుటుంబసభ్యులే ఆ బాధ్యత తీసుకోవాలని నాని సూచించారు.

టీడీపీ బ్రష్టుపట్టడానికి దేవినేని ఉమాలాంటి వ్యక్తులే కారణమని అటువంటి వారు ఉన్నంత కాలం పార్టీ బతికి బట్టకట్టదని నాని వ్యాఖ్యానించారు.

Advertisement
డిఫరెంట్ కథలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాలయ్య...

తాజా వార్తలు