బాలీవుడ్ లో కరోనా కలకలం, ప్రముఖ నటుడికి కరోనా పాజిటివ్

ఏమంటూ కరోనా లాక్ డౌన్ మొదలైందో గాని వరుసగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో పలువురు ఈ కరోనా మహమ్మారి కి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో గురి అవుతున్నారు.

ఇప్పటికే ఈ మహమ్మారి ప్రత్యక్షంగా సింగర్‌ కనికా కపూర్‌, నిర్మాత కరీం మోరాని, ఆయన కూతుళ్లు, నిర్మాత బోని కపూర్‌ ఇంట్లో సహాయకులు ఇబ్బందులకు గురి చేస్తుండగా,పరోక్షంగా లాక్ డౌన్ వల్ల సినీ కార్మికులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

దానికి తోడు బాలీవుడ్ ప్రముఖ నటులు కూడా ఈ కరోనా టైం లోనే ఇతర ఆరోగ్య కారణాల రీత్యా మృతి చెందగా ఇలా వరుసగా కరోనా కష్టాలు బాలీవుడ్ కు నిద్ర లేకుండా చేస్తున్నాయి.ఇప్పుడు తాజాగా మరో ప్రముఖ బాలీవుడ్ నటుడు కిరణ్‌ కుమార్‌ కరోనా బారిన పడినట్లు తెలుస్తుంది.

కరోనా లక్షణాలు లేకపోయినప్పటికీ ఆయనకు కరోనా టెస్ట్ పాజిటివ్ రావడం తో మే 14 నుంచి ఆయన హోం క్వారంటైన్‌లోనే ఉన్నట్లు తెలుస్తుంది.కాగా, 74 ఏళ్ల కిరణ్‌ పలు బాలీవుడ్‌ చిత్రాలతో పాటు.

సీరియల్స్‌లో కూడా నటించారు.ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ.

Advertisement

’వైరస్‌ లక్షణాలు లేకపోయినా నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.జ్వరం, దగ్గు కూడా లేవు.

ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను.అందుకే హోం క్వారంటైన్‌ లో ఉన్నాను అని తెలిపారు.

కరోనా నిర్ధారణ అయి 10 రోజులు అయినప్పటికీ నాలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు.మే 26న నాకు రెండో సారి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు అని, ప్రస్తుతానికి అయితే నేను క్షేమంగానే ఉన్నాను అని కిరణ్‌ తెలిపారు.

మొత్తానికి కరోనా ప్రముఖుల అందరినీ కూడా దాదాపు పలకరిస్తూనే ఉంది.బాలీవుడ్,హాలీవుడ్,టాలీవుడ్ ఇలా ఏ ఉడ్ తో కూడా సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా పలకరిస్తుంది.

సునామీలో టి సైలెంట్ నా ముందు నువ్వు సైలెంట్.. ఈ సినిమాతో శ్రీలీలకు హిట్టొస్తుందా?
Advertisement

తాజా వార్తలు