RC15 లో సీనియర్ హీరోయిన్.. సెకండాఫ్ లో ఈ పాత్ర సినిమాకే కీలకం!

అగ్ర దర్శకుల్లో డైరెక్టర్ శంకర్ ఒకరు.ఈయన ఏ సినిమా చేసిన అది భారీ స్థాయిలోనే ఉంటుంది.

ఇండియన్ జేమ్స్ కేమరూన్ గా పేరుతెచ్చుకున్న శంకర్ ప్రెసెంట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో ఆర్సీ 15 సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా కూడా ఆయన మార్క్ కు తగ్గట్టుగానే ఉండేలా చాలా జాగ్రత్తలతో ప్లాన్ చేస్తున్నాడు.

ఎంతో మంది నటీనటులను సినిమాలో భాగం చేస్తూ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తున్నాడు.ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.

అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్ ఎస్ థమన్ ను తీసుకున్నారు.ఇక దిల్ రాజు ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.

Advertisement

తాజాగా ఈ సినిమాలో మరో సీనియర్ నటిని భాగం చేసినట్టు తెలుస్తుంది.సీనియర్ హీరోయిన్ లలో ఖుష్బూ ఒకరు.

ఈమె ప్రెజెంట్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కీలక పాత్రల్లో నటిస్తుంది.

మరి శంకర్ ఈ సినిమాలో కీలక రోల్ కోసం ఖుష్బూ ను ఎంపిక చేసుకున్నారు.ఈ సినిమాలో సెకండాఫ్ లో ఒక స్పెషల్ ఎపిసోడ్ లో ఖుష్బూ నటించ బోతుంది అని.ఈ పాత్ర సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని అందుకే ఈమెను ఈ పాత్ర కోసం ఎంచుకున్నాడు అని టాక్ వినిపిస్తుంది.మరి ఈమె రోల్ ఎలా ఉండబోతుందో అనేది చూడాలి.

ఇక ఈ సినిమా ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందనే విషయం తెలిసిందే.ఈ సినిమా ఇలా ఉండగానే ఈ సినిమా షూటింగ్ కు తో పాటు శంకర్ ఇండియన్ 2 సినిమా కూడా షూట్ చేస్తున్నాడు.రెండు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ షూటింగ్ చేస్తున్నాడు.

ఆ పోస్ట్ లు షేర్ చేసేది ప్రభాస్ కాదు.. పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్ వైరల్!
ఏడాదికి పైగా పాకిస్తాన్ లో మగ్గిపోయాం.. రియల్ తండేల్ కామెంట్స్ వైరల్!

ప్రెజెంట్ రాజమండ్రి లో షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని మేకర్స్ ఫాస్ట్ గా షూట్ పూర్తి చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు