కేంద్రం ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా కేజ్రీవాల్ పోరు..!

ఢిల్లీలో పాలన అధికారాలపై కేంద్రం ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పోరు సాగిస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా పలు విపక్ష నేతలను కలుస్తున్న ఆయన మద్ధతు కోరుతున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజాను కేజ్రీవాల్ కలిశారు.ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వానికి అధికారాలు ఇవ్వడం లేదని చెప్పారు.

ఢిల్లీతో పాటు పుదుచ్చేరిలో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయన్నారు.కేంద్రం తీసుకొస్తున్న ఆర్డినెన్స్ ను తాము వ్యతిరేకిస్తున్నామన్న డి రాజా ఢిల్లీ ప్రభుత్వానికి అండగా ఉంటామని వెల్లడించారు.

సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు