కేసీఆర్ టార్గెట్ ఖమ్మం ! ఆయన సవాల్ తో సీరియస్ యాక్షన్ 

తమ రాజకీయ ప్రత్యర్థులు చేసే విమర్శలను సీరియస్ గా తీసుకుని యాక్షన్ లోకి దిగిపోతున్నారు బీ ఆర్ ఎస్ అధినేత , తెలంగాణ సీఎం కేసీఆర్( CM kcr ).

రాబోయే అసెంబ్లీ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకం కావడంతో కెసిఆర్ అప్రమత్తంగా ఉంటున్నారు.

ముఖ్యంగా పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు .అక్కడ భారీగా నిధులు కేటాయిస్తూ బిఆర్ఎస్ పై జనాల్లో ఆదరణ పెరిగే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికే అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ప్రకటన దాదాపుగా పూర్తి కావడంతో , ఇక ఎన్నికల వ్యూహాల పైన కెసిఆర్ దృష్టి సారించారు .ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు  అంతగా పట్టు లేకపోవడం,  అక్కడ కాంగ్రెస్ వామపక్ష పార్టీ ప్రభావం ఎక్కువగా ఉండడంతో , ఉమ్మడి ఖమ్మం జిల్లా పై ప్రత్యేకంగా దృష్టి సారించారు.ఈ మేరకు ఖమ్మం నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలు నిధులను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్( KTR ) మంజూరు చేశారు .

ఇక కొద్ది రోజుల క్రితం వివిధ అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం 690 కోట్లను కేటాయించారు.ఇక తాజాగా తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వంద కోట్లను మంజూరు చేశారు.ఈ నిధులతో ఎన్నికల నాటికి అనేక అభివృద్ధి పనులు పూర్తవుతాయని , జనాల్లో బీఆర్ఎస్ ఆదరణ పెరుగుతుందని కేసిఆర్ అంచనా వేస్తున్నారు.

ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని అభ్యర్థులతోనూ , కీలక నాయకులతోనూ ఎప్పటికప్పుడు కెసిఆర్ సమీక్ష చేస్తున్నారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మెజార్టీ స్థానాలను గెలుచుకోవడమే కేసిఆర్ టార్గెట్ గా పెట్టుకున్నారు.

Advertisement

2014 -18 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొత్తగూడెం స్థానంలో మాత్రమే బీఆర్ఎస్( BRS ) గెలిచింది.అయితే ఈసారి ఆ తరహా పరిస్థితులు ఏర్పడకుండా మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.కెసిఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ను ఇంత సీరియస్ గా తీసుకోవడానికి కారణాలు చాలా ఉన్నాయి.

  బీఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరించిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం,  అలాగే సీనియర్ నాయకుడు మంత్రి తుమ్మల నాగేశ్వరావు ( Tummala nageswararao )సైతం కాంగ్రెస్ లో చేరేందుకు ఏర్పాటు చేసుకుంటూ ఉండడంతో, కెసిఆర్ ఈ ఉమ్మడి జిల్లాను ఇంత సీరియస్ గా తీసుకున్నారు.ముఖ్యంగా జనరల్ స్థానాలైన ఖమ్మం, కొత్తగూడెం, పాలేరు, నియోజకవర్గాలపై ప్రత్యేకంగా పెట్టారు.

కొద్దిరోజుల క్రితం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కెసిఆర్ సీరియస్ గా తీసుకున్నారు. వాళ్ళు ఎవరో మనల్ని మళ్ళీ అసెంబ్లీ గేటు తాకనివ్వను  అన్నారు.

కాబట్టే వాళ్లనే మనం అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకోవాలి.ఆ సవాల్ ను దృష్టిలో పెట్టుకొని పని చేయండి అంటూ క్యాడర్ కు కేసీఆర్ సూచించారు.

ఫ్రీ టైమ్‌లో నన్ను చూసి నేను ప్రౌడ్‌గా ఫీల్ అవుతా : నాని
ఆ మూవీ విషయంలో చేసిన తప్పే ఇప్పుడు చేస్తున్న నాని.. ఇంత నిడివి అవసరమా అంటూ?
Advertisement

తాజా వార్తలు