పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ( kcr )శాసనసభ సభ్యుడిగా నేడు ప్రమాణ స్వీకారం చేయటం తెలిసిందే.

గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఫామ్ హౌస్ బాత్రూంలో కేసీఆర్ పడిపోవడం జరిగింది.

దీంతో తుంటి ఎముక విరగటంతో యశోద హాస్పిటల్( Yashoda Hospital ) లో సర్జరీ చేయడం జరిగింది.అనంతరం 8 వారాలు విశ్రాంతి తీసుకున్న కేసీఆర్ నేడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.

గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో గజ్వేల్ శాసనసభ నుంచి కేసీఆర్ గెలవడం జరిగింది.ఆ సమయంలో గెలిచిన ఎమ్మెల్యేలంతా డిసెంబర్ నెలలో ప్రమాణ స్వీకారం చేశారు.

Kcr Interesting Comments On The Congress Party In The Meeting Of Mlas Of The Par

కానీ కేసీఆర్ పడిపోయి గాయాలు కావటంతో ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు.ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అనంతరం నేడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశమయ్యారు.ఈ సందర్భంగా అధికార పార్టీ కాంగ్రెస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Advertisement
KCR Interesting Comments On The Congress Party In The Meeting Of MLAs Of The Par

కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు.

దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) ఉంటుందా ఉండదా అనేది ఆ నాయకులు చేతుల్లోనే ఉంది.ప్రతిపక్షపాత్రను సమర్ధంగా నిర్వహిద్దాం.

లోక్ సభ ఎన్నికలలో గట్టిగా పోరాడుదాం.అందరితో చర్చించాకే మంచి అభ్యర్థులను ప్రకటిస్తా అని కేసీఆర్ స్పష్టం చేయడం జరిగింది.

నితిన్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు