పిఆర్సి, ఉద్యోగస్తుల పదవీ విరమణ విషయాల్లో కీలక ప్రకటన చేసిన కేసీఆర్..!!

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగస్తులు గత కొంత కాలం నుండి పిఆర్సి విషయంలో అనేక పోరాటాలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్న క్రమంలో పిఆర్సి అదేవిధంగా ఉద్యోగస్తుల పదవీ విరమణ వయసు కు సంబంధించి సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు.

తెలంగాణ ఉద్యమంలో అనేక ఒత్తిళ్లు వచ్చినా గానీ ఎక్కడా కూడా బెదరకుండా సాహసోపేతంగా సకల జనుల సమ్మె చేసిఉద్యమంలో కీలక పాత్ర పోషించారని ఉద్యోగస్తులను కొనియాడారు.ప్రస్తుతం ప్రభుత్వం విజయవంతంగా పరిపాలన అందిస్తుంది అంటే అందులో తెలంగాణ ఉద్యోగస్తుల పాత్ర ఎంతో ఉందని అందువల్ల పిఆర్సి 30 శాతం పెంచినట్లు స్పష్టం చేశారు.

పి ఆర్ సి కి సంబంధించి గతంలో ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ అన్ని ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు.అంతేకాకుండా గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగస్తుల పదవీ విరమణ వయసు 61 సంవత్సరాలు పెంచుతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.

ఇంకా అనేక విషయాలలో తెలంగాణ ఉద్యోగస్తులకు వరాల జల్లు కురిపించారు.  .

Advertisement
రాజకీయాల కంటే సినిమాలే బెటర్.. కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు