కేసీఆర్ ముంచిండు ! ' కారు ' తో కాంగ్రెస్ వినూత్న నిరసన 

తమ రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయడం కంటే ,ఆ విమర్శలను ప్రజల్లోకి వినూత్నంగా తీసుకువెళ్ళేందుకు తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) సరికొత్త రూట్ ను ఎంచుకుంది.

ఈ మేరకు బీ ఆర్ ఎస్ పార్టీ ఎన్నికల గుర్తయిన కారు ను కాంగ్రెస్ తమ ప్రచారానికి ఎంచుకుంది.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందనే సర్వే నివేదికతో స్పీడ్ పెంచిన కాంగ్రెస్ పార్టీ దానికి అనుగుణంగానే వారి వైఫల్యలను ప్రజల్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తుంది.దీనిలో భాగంగానే బీఆర్ఎస్ ఎన్నికల గుర్తైన కారును తమ ప్రచారానికి కాంగ్రెస్ ఉపయోగించుకుంటుంది.

  బై బై కేసీఆర్ అంటూ కారుపై బిఆర్ఎస్ ప్రభుత్వ 10 స్కాం లను కారు పై  ప్రదర్శిస్తూ బీ ఆర్ ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే పనికి శ్రీకారం చుట్టింది.

 కారు నెంబర్ ప్లేట్ ని కూడా వినూత్నంగా డిజైన్ చేయించింది కాంగ్రెస్ పార్టీ.  కెసిఆర్( CM kcr ) 420 పేరుతో నెంబర్ ప్లేట్ ను కారు కు అమర్చి ఆ కారును ప్రచారానికి ఉపయోగిస్తున్నారు. తెలంగాణ ముంచిండు.ఐదు లక్షల కోట్ల అప్పులు మోపిండు.10 ఏళ్ల అహంకారంపై తిరగబడదాం, పందిళ్ళ ఫంక్షన్ ప్రభుత్వాన్ని తరిమికొడదాం అంటూ  కెసిఆర్ చిత్రపటాలతో గులాబీ రంగు కార్లను సిద్ధం చేసింది కాంగ్రెస్ పార్టీ.

Advertisement

ఈ కారు ప్రచారంతో కాంగ్రెస్ కు ఆదరణ లభిస్తుంది.  బీఆర్ఎస్ ( BRS )ప్రభుత్వ వైఫల్యాలు జనాల్లోకి వెళితే రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలోను ఇదే తరహా లో కారు పార్టీ గుర్తు అయిన కారు తోనే బిఆర్ఎస్ వైఫల్యాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లి ఆ పార్టీ విజయ అవకాశాలను దెబ్బతీయాలనే పట్టుదలతో కాంగ్రెస్ ఉంది.కాంగ్రెస్ తమ పార్టీ గుర్తును తమపై ఈ విధంగా ప్రయోగిస్తూ ఉండడం తో  దీనిని తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ కూడా అంతే స్థాయిలో వ్యూహాలు రచిస్తోంది.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?
Advertisement

తాజా వార్తలు