వుయ్ వాంట్ 100 పర్సెంట్ ఆక్యుపెన్సీ.. కర్ణాటక ప్రేక్షకుల డిమాండ్..!

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం సడెన్ గా థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీని ప్రకటించింది.

కరోనా లాక్ డౌన్ తర్వాత కొన్నాళ్లకు థియేటర్లను తెరచుకునే అవకాశం ఇవ్వగా మొదట్లో కొన్నాళ్లు 50 శాతం ఆక్యుపెన్సీకి మాత్రమే అనుమతి ఇచ్చారు.

ఇక ఆ తర్వాత 100 పర్సెంట్ ఆక్యుపెన్సీ క్లియర్ చేశారు.అయితే మళ్లీ కేసులు పెరుగుతున్న కారణంగా కర్ణాటక ప్రభుత్వం థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీని విధించింది.

Karnataka Audience Demanding For 100 Percent Occupancy In Theaters , 100 Percent

థియేటర్లలో 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ రీసెంట్ సినిమాల ఫలితంపై ఎఫెక్ట్ పడ్డది.కన్నడలో రీసెంట్ గా రిలీజైన రాబర్ట్ సినిమా టాక్ బాగాలేకపోయినా ఓ మోస్తారు వసూళ్లను రాబట్టింది.

అయితే లేటెస్ట్ గా రిలీజైన పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ యువరత్న సినిమా మీద ఈ ఎఫెక్ట్ పడ్డది.సినీ ప్రముఖులు, కన్నడ ప్రేక్షకులు కూడా థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీ ఇవ్వాలని కోరుతున్నారు.

Advertisement

ఈ క్రమంలో వుయ్ వాంట్ 100 పర్సెంట్ ఆక్యుపెన్సీ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.ఇప్పటికే యువరత్న యూనిట్ తో పాటుగా పునీత్ రాజ్ కుమార్ కర్ణాటక సిఎం యడ్యూరప్పని కలిసి వినతి పత్రాన్ని అందించారు.

పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం కర్ణాటకలో థియేటర్లకు 100 పర్సెంట్ ఆక్యుపెన్సీ పర్మిషన్ ఇవ్వాలని భారీ ఎత్తున సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు