మ‌ళ్లి ముద్ర‌గ‌డ దీక్ష‌... స‌ర్వత్రా ఉత్కంఠ‌

కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించాలన్న‌ది ్ర‌ప‌ధాన డిమాండ్‌తో గురువారం నుంచి త‌న భార్య‌తో క‌ల్సి కిర్లంపూడిలో ఆమరణ దీక్ష చేపట్టనున్నాన‌ని వెల్ల‌డించారు మాజీ మంత్రి, కాపునాడు నేత‌ ముద్రగడ పద్మనాభం.

తూర్పుగోదావరి జిల్లా తునిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.

తునిలో దహనకాండకు ప్రభుత్వమే రూపకల్పన చేసింద‌ని, ఇప్పుడు అమాయ‌కుల‌ను అరెస్టుల పేరుతోవేధిస్తోంద‌ని, తన అనుచరులు, కాపు కార్యకర్తలపై పెట్టిన కేసులు ఎత్తివేయాల‌ని, కాపులను బీసీల్లో చేర్చడంతో పాటు ఎన్నికల హామీలు నెరవేర్చేంత‌ వ‌ర‌కు త‌న పోరాటం ఆగ‌ద‌ని స్ప‌ష్టం చేసారు.కాపు ఉద్యమానికి, ఉద్యమకారులకు తాను అండగా ఉన్నాన‌ని, కిర్లంపూడిలో దీక్ష ప్రారంభిస్తాన‌ని, ఈలోగా తనను అరెస్టు చేసి జైల్లో పెడితే జైల్లోనే దీక్షకు కూర్చుంటాన‌ని ఆయన ప్రకటించారు.

ఒకరిని అరెస్టు చేస్తే వందమంది జైలుకు వేళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని ప్ర‌భుత్వం గుర్తుంచుకోవాల‌ని, ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు.తుని దహనకాండ వెనుక‌ ప్రభుత్వం ఉంద‌న్న త‌న ఆరోప‌ణ‌ల‌కు సంబంధించి ఆధారాలన్నీ తమ వద్ద ఉన్నాయని స్ప‌ష్టం చేసారు.

వీటిని మీడియాకు అందించాల‌ని కోర‌గా ప్రభుత్వ చర్యల కారణంగా బయట పెట్టలేకపోతున్నాన‌ని, త్వ‌ర‌లో వాటిని చూపిస్తాన‌ని చెప్పారు.కాగా తుని ఘటనలో అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలన్న‌ది కాపు నేత ముద్రగడ పద్మనాభం ప్ర‌ధాన డియాండ్ గా ఉంద‌ని పోలీసులు వెల్ల‌డిస్తున్నారు.

Advertisement

తిర‌గి ముద్రగడ ఆమ‌ర‌ణ దీక్షకు దిగుతున్న నేపథ్యంలో కిర్లంపూడి పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించి అనేక ఔట్‌పోస్టులు ఏర్పాటు చేసి, తనిఖీలు ముమ్మ‌రం చేసారు.ఈ ద‌ఫా ఎట్టి ప‌రిస్థితిలోనూ ముద్ర‌గ‌డ‌కు అవ‌కాశం రాకుండా చూసుకోవాల‌ని, అవ‌ర‌స‌మైతే త‌క్ష‌ణ అరెస్టుకు సిద్ధం కావాల‌ని పోలీసు వ‌ర్గాల‌కు విస్ప‌ష్ట ఆదేశాలందిన‌ట్టు స‌మాచారం .

నేటి ఎన్నికల ప్రచారం: నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్ .. రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ అంటే ?
Advertisement

తాజా వార్తలు