కమండల గణపతి ఆలయం ఎక్కడ ఉంది... ఈ ఆలయ విశిష్టత ఏమిటో తెలుసా?

దేవ దేవతలలో వినాయకుడు సకల దేవతలకు అధిపతి గా చెబుతారు.మనం ఏదైనా కార్యం తలపెట్టినప్పుడు ముందుగా వినాయకుడికి పూజ చేయటం వల్ల ఆ కార్యంలో ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తవుతుందని భావిస్తారు.

విజయానికి, జ్ఞానానికి ప్రతీకగా వినాయకుడిని భావిస్తారు.32 రూపాలలో ఉన్న ఈ గణనాథుడిని వివిధ రకాల పేర్లతో పిలిచి పూజిస్తాము.ఈ విధంగానే వినాయకుడు కమండల గణపతిగా పేరు పొంది ఎంతో ప్రసిద్ధి చెందాడు.

అసలు వినాయకుడికి కమండల గణపతి అని పేరు రావడానికి గల కారణం ఏమిటి ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసుకుందాం.కర్ణాటకలోని చిక్క మంగళూరు జిల్లా కొప్ప పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి దట్టమైన అటవీ ప్రదేశంలో ఈ కమండల గణపతి ఆలయం ఉంది.

ఈ ఆలయానికి సుమారు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉందని చెబుతారు.ఈ స్థల పురాణానికి వస్తే శని వక్ర దృష్టి కారణంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న పార్వతీదేవి ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు చేయాలని భావించి వినాయకుడిని ప్రార్థించిందని ఆ సమయంలోనే వినాయకుడు బ్రహ్మచారి రూపంలో కమండలం ధరించి, వినాయకుడి సృష్టించిన తీర్థాన్ని బ్రహ్మ తీర్థం అని చెబుతారు.

ఈ విధంగా వినాయకుడు కమండలం ధరించి ఉండటంవల్ల ఈ ఆలయానికి కమండల గణపతి అనే పేరు వచ్చింది.

Kamandal Ganapathi Temple History Timings And How To Reach, Kamandal Ganapathi T
Advertisement
Kamandal Ganapathi Temple History Timings And How To Reach, Kamandal Ganapathi T

ఈ ఆలయంలోని వినాయకుడు మనకు యోగ ముద్రలో కూర్చుని భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు.వర్షాకాల సమయంలో పుష్కరిణిలో ఉండే నీరు స్వామివారి పాదాలకు తాకుతుంది.ఈ సమయంలో స్వామివారిని దర్శించి ఆ నీటిని మహా తీర్థ ప్రసాదంగా తీసుకుంటారు.

ఈ నీటిని తీసుకోవటం వల్ల సకల రోగాలు నయమవుతాయని భక్తులు భావిస్తారు.ఈ విధంగా పుష్కరిణిలోని నీరు వినాయకుడి పాదాలను తాకడం వల్ల ఇక్కడ వెలసిన స్వామివారిని కమండల గణపతి అని కూడా పిలుస్తారు.

అయితే ఇక్కడ స్వామివారి ఆలయంలో పూజలు మధ్యాహ్నం వరకే నిర్వహిస్తారు కనుక స్వామివారిని దర్శించుకోవాలంటే తెల్లవారుజామునే ఇక్కడికి చేరుకుని స్వామివారికి పూజలు చేస్తుంటారు.

చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!
Advertisement

తాజా వార్తలు