సీన్ రివర్స్..కమలా హారీస్ కి ఓట్లు వేయం..!!

వారం రోజుల వ్యవధిలో అమెరికాలో కీలక ఘట్టం మొదలవబోతోంది.అధ్యక్ష ఎన్నికలపై రెండు సంవత్సరాలుగా తీవ్ర కసరత్తులు చేస్తున్న అభ్యర్ధుల జాతకాలు బయటపడనున్నాయి.

అమెరికన్స్ ఎవరిని అధ్యక్షుడిగా ఎన్నుకుంటారోననే ఆసక్తి పెరిగిపోతోంది.అయితే ట్రంప్ నాయకత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్న వారందరూ ఇప్పుడు తమ నిర్ణయాన్ని ఓట్ల ద్వారా వెల్లడించడానికి సిద్దమయ్యారు.

Pak Americans Not Support To Kamala Harris Kamala Harrish, Joe Bidden, Jammu An

ముఖ్యంగా అమెరికాలో ట్రంప్ ను ముందు నుంచీ వ్యతిరేకిస్తూ వచ్చిన పాక్ ఇండియన్స్ తమ మద్దతును బిడెన్ కు పూర్తి స్థాయిగా ఇచ్చేందుకు సిద్దమయ్యారు.వలసదారులకు, మైనారిటీలకు, మహిళలకు ట్రంప్ పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది.

ఇప్పుడు అదే వ్యతిరేకత బిడెన్ కి కలిసొస్తోంది.ముందు నుంచీ ట్రంప్ పై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న పాక్ అమెరికన్స్ బిడెన్ కి బహిరంగంగా మద్దతు ఇస్తున్నారు.

Advertisement

అయితే అదే డెమొక్రాట్ పాక్ అమెరికన్స్ కమలా హరిస్ కి ఓటు వేయడానికి మాత్రం ఇష్టపడటంలేదట.అందుకు కారణం ఏమిటంటే.

ఆమె కాశ్మీర్ విషయంలో భారత్ కి మద్దతుగా వ్యవహరించడమేనని అంటున్నారు.భారత ప్రధాని మోడీ కాశ్మీర్ విషయంలో తీసుకుంటున్న పార్టీ నిర్ణయాన్ని కమలా హరిస్ సమర్ధించడం వారికీ నచ్చడంలేదు పైగా కమలా తల్లి భారతీయురాలు కావడం కూడా మరో కారణమని తెలుస్తోంది.

బిడెన్ మాత్రం కాశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని , పౌరసత్వ సవరణ బిల్లు తీసుకురావడాన్ని వ్యతిరేకించారు అందుకే పాక్ అమెరికన్స్ బిడెన్ కి మద్దతు తెలిపుతున్నారు.ప్రపంచంలో కాష్మీరీలు ఒంటరి వారుగా ఉండరని నేను వారికి మద్దతుగా ఉంటానని కమలా హరిస్ చెప్పడం ఇలా అనేక కారణాల ద్వారా కమలా పై విముఖత వ్యక్తం చేస్తున్నారు ఆమె కాశ్మీర్ విషయంలో పాక్ కు మద్దతు ఇస్తే తప్పకుండా ఆమెకే ఓటు వేస్తామని అంటున్నారు.

ఈగ సినిమాకు సీక్వెల్ వస్తోందట.. అసలు ట్విస్ట్ తెలిస్తే మాత్రం అవాక్కవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు