కమలా హరీస్ సంచలన ప్రకటన..????

అమెరికాలో భారతీయ సంతతి వ్యక్తుల హవా అంతా ఇంతాకాదు.మరే ఇతరదేశ ప్రవాసులకి లేనంత విలువ భారతీయ సంతతి వ్యక్తులకి అమెరికాలో ప్రాధాన్యత ఉంటుంది.

ఈ విషయం ఎన్నో సందర్భాలలో రుజువయ్యింది కూడా.ఇదిలాఉంటే ఇక్కడ మరొక విషయం ఏమిటంటే ఈ సారి జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ ప్రవాస మహిళా కమలా హారీస్ పోటీ చేయనున్నారని ఎన్నో వార్తలు వచ్చాయి.

ఈ వార్తలని గతంలో సైతం కమలా సూతన ప్రాయంగా ధ్రువీకరించారు అయితే తాజాగా ఆమె మరోసారి ప్రకటన చేశారు.తాను తీసుకునే నిర్ణయం ఏదైనా సరే కుటుంబంతో చర్చించిన తరువాత మాత్రమే తీసుకుంటానని అన్నారు.ఇదిలాఉంటే కాలిఫోర్నియాలోని ఓక్లహాంలో జన్మించిన ఆమె తల్లి భారతీయురాలు కాగా ఆమె తండ్రి జమైకన్‌ అమెరికన్‌.

అయితే తల్లి శ్యామలా గోపాలన్‌ సైన్స్‌ పట్టభద్రురాలు కాగా తండ్రి అమెరికాలో ఆర్థిక శాస్త్రంలో ప్రసిద్ద వ్యక్తిగా పేరుంది.ఒబామాకి ఎంతో దగ్గర వ్యక్తిగా వుండే కమలా హారిస్‌ను మహిళా ఒబామాగా పిలిచేవారు.అమెరికాలో గనుకా ట్రంప్ మరో సారి పోటీ చేస్తే తప్పకుండా ట్రంప్ పై విజయం సాధినే మొదటి వ్యక్తి కమాలనే అనేది విశ్లేషకుల అభిప్రాయం.

Advertisement
యూరోపియన్ ఇన్ఫర్మేటిక్స్ ఒలింపియాడ్‌: భారత సంతతి బాలికకు రజతం .. ఎవరీ అనన్య గోయల్..?
Advertisement

తాజా వార్తలు