పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మీ, షాదిముబారక్ పథకాలు ఓ వరం..మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

పేదింటి ఆడబిడ్డలకు వరం కళ్యాణలక్ష్మీ, షాదిముబారక్ పథకాలనిజిల్లా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.గురువారం మంత్రి క్యాంపు కార్యాలయంలో రూ.

1కోటి 27 లక్షల 14 వేల 732 విలువ గల చెక్కులు పంపిణి చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మీ, షాదిముబారక్ పథకాలు గొప్పవరమని అన్నారు.

గతంలో ఏ ప్రభుత్వం కూడా అమలు చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదింటి ఆడపడచులు ఇబ్బందులు పడకండా ఉండేందుకు కళ్యాణ లక్ష్మీ, షాదిముబారక్ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందని అన్నారు.కళ్యాణలక్ష్మీ, షాదిముబారక్ పథకాల ద్వారా పేదింటి ఆడపడచుల ముఖాల్లో వెలుగులు నింపుతున్నామని మంత్రి తెలిపారు.

చెక్కులు అందుకుంటున్న ఆడపడచులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, ముఖ్యమంత్రి చల్లగా ఉండాలని దీవిస్తున్నారని పేర్కోన్నారు.రూ.51,000 ప్రారంభించిన కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ ఆ తర్వాత రూ.75,000 లు, ఆ తర్వాత రూ.1,16,000 అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ మాట్లాడుతూ, పేదవారికి ఆడబిడ్డ భారం కావద్దని ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రవేశపెట్టిందని అన్నారు.ఈ పథకంతో బాల్యవివాహాలు, ఆడబిడ్డ భారం అనే ఆలోచనలో దూరం అయిందని ఆయన తెలిపారు.గత 4 సంవత్సరాలలో ఖమ్మం పట్టణ పరిధిలో 5,724 మందికి రూ.53 కోట్ల 83 లక్షల 76 వేలు, ఖమ్మం నియోజకవర్గ పరిధిలో 7,279 మందికి రూ.70 కోట్లు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథక లబ్ది పొందినట్లు ఆయన అన్నారు.కోవిడ్ సమయంలో కూడా పథకాన్ని అమలు చేసినట్లు, మంత్రివర్యులు లబ్దిదారుల ఇంటికి వెళ్లి చెక్కులు ఆందజేసినట్లు, ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువకు తీసుకెళ్లారని ఆయన తెలిపారు.

Advertisement

చెక్కుల పంపిణీ అనంతరం మంత్రి, కలెక్టర్లు లబ్దిదారులతో సహఫంక్తి భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ శైలజ, కార్పొరేటర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఖ‌ర్జూరాలు తినే ముందు ఇవి తెలుసుకోపోతే..మీ దంతాల‌కే ముప్పు జాగ్ర‌త్త‌!
Advertisement

తాజా వార్తలు