మరోసారి అతనికి ఛాన్స్ ఇచ్చిన కళ్యాణ్ రామ్..!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సినిమాటోగ్రాఫర్ కె.వి గుహన్ దర్శకుడిగా మారి చేసిన సినిమా 118.

ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించడంతో కొద్దిపాటి గ్యాప్ తో మళ్లీ అతని డైరక్షన్ లో సినిమా చేస్తున్నారు కళ్యాణ్ రామ్.కళ్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా గుహన్ డైరక్షన్ లో సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చింది.

నందమూరి కళ్యాణ్ రామ్ 20వ సినిమాగా ఇది వస్తుంది.ఇక ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండటం విశేషం.

సినిమా ఎనౌన్స్ మెంట్ లో క్రైం సీన్ డునాట్ క్రాస్ అని పోస్టర్ వదిలారు అంటే ఈ సినిమా కూడా థ్రిల్లర్ అంశాలతో వస్తుందని తెలుస్తుంది.ఇప్పటికే కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ట డైరక్షన్ లో బింబిసారా సెట్స్ మీద ఉంది.

Advertisement

ఇదే కాకుండా ఏజెంట్ వినోద్ అనే సినిమా కూడా చేస్తున్నాడు.ఇక ఈ రెండిటితో పాటుగా ఇప్పుడు కెవి గుహన్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు.

వరుస క్రేజీ సినిమాలతో కళ్యాణ్ రామ్ సత్తా చాటాలని చూస్తున్నారు.రొటీన్ కథలతో కాకుండా ఈసారి కొత్త ప్రయోగాలు చేస్తున్న కళ్యాణ్ రామ్ ఈ మూడు సినిమాలతో తప్పకుండా ఆశించిన స్థాయిలో హిట్ కొడతాడో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు