భర్త కోసం సినిమాలకు గుడ్ బై చెప్తున్నా కాజల్!

టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ కాజల్ అగర్వాల్ పరిచయం గురించి అందరికీ తెలిసిందే.

తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.

లక్ష్మీకళ్యాణం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది.ఆ తర్వాత ఏడాదికి వరుస సినిమాలలో నటించి మంచి సక్సెస్ లు అందుకుంది.

ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది.ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ ఓ నిర్ణయం తీసుకుంది.

తన భర్త కోసం సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.గత ఏడాది ఈ బ్యూటీ గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

పెళ్లి తర్వాత సినిమాలలో నటించదని పుకార్లు వినిపించగా.వాటికి స్పందించి తన భర్త గౌతమ్ తనను సినిమాలను వదులుకోమని చెప్పినప్పుడే వదులుకుంటానని అభిమానులకు క్లారిటీ ఇచ్చింది.

అలా మొత్తానికి వరుస అవకాశాలతో బాగా బిజీగా ఉంది.పెళ్లి తర్వాత తన భర్తతో ఎక్కువ సమయాన్ని గడపలేకపోయింది.

దాంతో తన భర్త కోసం కొన్ని రోజులు సినిమాలకు బ్రేక్ చెప్పి గుడ్ బై చెప్పింది.

ఇక ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమాతో పాటు బాలీవుడ్ లో హే సినామిక, కరుంగాపియమ్, ఘోస్టీ సినిమాల షూటింగ్ లను కూడా పూర్తి చేసింది.ఈ సినిమాలతో పాటు మరిన్ని సినిమాలకు కూడా ఓకే చెప్పిన ఈ అమ్మడు.

నిత్యం ఈ పొడిని తీసుకుంటే కళ్ళ‌జోడుకు మీరు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు!
కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?

అందులో ఉమ అనే సినిమా షూటింగ్ లో ఓ షెడ్యూల్ ను ఇటీవలే పూర్తి చేసిందట.

Advertisement

అంతేకాకుండా నాగార్జునతో కూడా మరో సినిమాకు ఒప్పుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో కాజల్ వేశ్య పాత్రలో కనిపించనుంది.ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ బిజీగా ఉన్నా కూడా కొన్ని రోజులు కాజల్ పాత్రకు బ్రేక్ దొరికింది.కాబట్టి తన భర్తతో కలిసి సమయాన్ని గడపడానికి కొన్ని రోజుల వరకు సినిమాలకు దూరంగా ఉండనుంది.

తాజా వార్తలు