ఈ హీరోయిన్ కి అంత పొగరు ఎందుకు.. నెటిజెన్స్ ఫైర్!

సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు అభిమానుల నుండి మాత్రమే మంచి ఫాలోయింగ్ ఉంటుంది.అంతేకానీ మిగతా వాళ్ళు వాళ్ళని పట్టించుకోను కూడా పట్టించుకోరు.

నిజానికి అభిమానులు చూపించే ప్రేమ పట్ల వారికి కొంత వరకు గౌరవం ఉంటుంది.కానీ ఒక్కసారి ఆ గౌరవాన్ని కోల్పోతే మళ్లీ అటువంటి గౌరవాన్ని ఏ సెలబ్రెటీలు కాదు కదా ఏ వ్యక్తులు కూడా అందుకోలేరు.

అలాంటిది ఒక హీరోయిన్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది కానీ ఏం లాభం వ్యక్తిగతంగా తన గౌరవాన్ని కోల్పోయింది.ఇంతకీ ఆమె ఎవరో కాదు.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్.ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.

Advertisement

పైగా బాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది.ఇదిలా ఉంటే తాజాగా ఆమెకు సంబంధించిన వీడియో నెట్టింట్లో బాగా వైరల్ గా మారింది.

పైగా కామెంట్స్ కూడా చాలా వ్యతిరేకంగానే ఎదుర్కొంటుంది.ఇలా కావడానికి అసలు కారణముంది.

తాజాగా తను 47 వ పుట్టిన రోజు జరుపుకుంది.ప్రస్తుతం కోవిడ్ కారణంగా చాలా వరకు అన్ని వేడుకలు సింపుల్ గానే జరుగుతున్నాయి.

దీంతో కాజోల్ బర్త్ డే వేడుకలు కూడా చాలా సింపుల్ గా జరిగాయి.తన అభిమానులు తన కోసం కేక్ తీసుకొచ్చి తన ఇంటి వద్ద గేటు బయట నిల్చున్నారు.ఇక కాజోల్ కూడా వారిని ఇంటి బయటనే ఉంచి వారి అభిమానం కోసం వాళ్ళు తెచ్చిన కేక్ ను కట్ చేసింది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

అభిమానులంతా తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్లకు థాంక్స్ అన్నట్లు దండం పెట్టి వెళ్తుండగా.అభిమానులు ప్రేమతో తనను కేక్ తినమని వేడుకున్నారు.దాంతో కాజోల్ కేక్ వద్దన్నట్లు చేతిని అడ్డం చూపించి.

Advertisement

వారితో ఒక ఫోటో దిగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

తమ అభిమాన హీరోయిన్ కేక్ తినలేదని అభిమానులు కాస్త నిరుత్సాహం చెందినట్లు అనిపించగా.ఈ వేడుకకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.

ఈమెకు ఎందుకు అంత పొగరు అంటూ పెద్ద కామెంట్స్ చేస్తున్నారు.తెరముందు కనిపించినట్లు తెరవెనుక అలా ఉండరు వీళ్ళు అని బాగా మండిపడుతున్నారు.

తాజా వార్తలు