"కేజీఎఫ్ 2" సక్సెస్ వెనుక కైకాల సత్యనారాయణ ఉన్నారా?

ప్రస్తుతం దునియా మొత్తం ఇపుడు ఒకే మ్యాటర్ పై డిస్కస్ చేసుకుంటున్నారు.

అదేనండి కేజీఎఫ్ చాప్టర్ 2 అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతోంది ఈ పేరు, ఎక్కడ విన్నా రాఖీ బాయ్ గురించి మాటలు వినపడుతున్నాయి.

అయితే ఈ సినిమాకి సంబందించిన కొన్ని ఆసక్తికర విషయాలను తెలియచేశారు సీనియర్ జర్నలిస్టు భరద్వాజ్.ఒక అంశం గురించి ఖచ్చితమైన రివ్యూ ఇవ్వగల ఈ ప్రముఖ జర్నలిస్ట్ కేజీఎఫ్ చాప్టర్ 2 గురించి ఏమన్నారో ఇపుడు తెలుసుకుందాం.

తాజాగా ఒక ఇంటర్వ్యూకి విచ్చేసిన ఈయన కేజీఎఫ్ సినిమా గురించి యాంకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.అయితే కేజీఎఫ్ చాప్టర్ 2 లో ప్రకాష్ రాజ్ గారి పాత్ర ఏదో సినిమా స్థాయిని మరికాస్త పెంచడానికి ఇరికించినట్లు ఉందా లేక కన్విన్సింగ్ గా ఉందా అని అడుగగా ? అక్కడ పాత్రను ఇరికించడం కాదు అది కన్విన్సింగ్ గా ఉంది, నిజానికి కథలో మరింత ఆసక్తి పెంచేందుకు కనెక్ట్ అయ్యేందుకు ఆ క్యారెక్టర్ ను సృష్టించడం జరిగింది.అంటే ఆ జర్నలిస్ట్ రాఖీ బాయ్ నిజ జీవిత కథను రాయడానికి ఎంతగా ఇన్వాల్వ్ అయ్యాడు, ఎలా సమాచారాన్ని సేకరించాడు.

అలాగే ఈ క్రమంలో తన కుటుంబాన్ని సైతం పెద్దగా పట్టించుకోడు.అంతగా ఆ కథకు కనెక్ట్ అయ్యి ఒక ప్యూర్ రియాలిటీ లెజెండ్రీ స్టోరీని ఈ సొసైటీకి అందించడానికి ఎంత కృషి చేశాడు అన్నది తెలియ చేసేందుకే కొడుకుగా ప్రకాష్ రాజ్ పాత్రను ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది.

Advertisement

అలాగే ఆ పాత్ర కూడా అనుకున్న విధంగానే బాగా వర్కౌట్ అయ్యి మంచి రిజల్ట్ వచ్చిన విషయం తెలిసిందే అని చెప్పుకొచ్చారు భరద్వాజ్.

అలాగే బాలీవుడ్ సంజయ్ దత్ గురించి మాట్లాడుతూ అధీరా పాత్రని ఆయన తన శరీరంతో నటించాడు, ఇలాంటి వైవిధ్యభరితమైన పాత్రలు పోషించడం కానీ వాటిని పర్ఫెక్ట్ గా పండించడం కానీ సంజయ్ కొత్తేమీ కాదు.అందుకే ఆయనను సెలెక్ట్ చేశారు.ఆశించిన విధంగానే మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ తో రాఖీ బాయ్ స్థాయికి తగ్గ విలన్ గా పవర్ ను కనబరిచారు సంజయ్ అని అన్నారు.

అలాగే దర్శకుడు ప్రశాంత్ నీల్ అద్భుతమైన కమర్షియల్ డైరెక్టర్ గా ఆయన ఆల్ రెడీ సెటిల్ అయిపోయారు.అలాగే మాస్ ప్రేక్షకులని మెప్పించడం అంటే అంత సులభమైన విషయం కాదు, అలాంటిది కేజీఎఫ్ తో ఆయన ఫుల్ ఫిల్ గా అన్ని వర్గాల ప్రేక్షకుల మనసును కబ్జా చేసేసారు అన్నారు.

కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చి బాలీవుడ్ దర్శకులకు అలాగే టాలీవుడ్ లో దర్శకుడు రాజమౌళికి దీటుగా గట్టి పోటీ ఇచ్చినట్లే కనిపిస్తోంది ఈ సినిమా చూస్తే అంటూ ప్రశాంత్ నీల్ ను కొనియాడారు.అయితే ఈ సినిమాను కైకాల సత్యనారాయణ సమర్పించారు.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

అంటే ఇతని ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా అందింది అని చెప్పాలి.మొదటి పార్ట్ సమయంలో కూడా కైకాల ఈ సినిమా గురించి యశ్ గురించి చాలా గొప్పగా మాట్లాడారు.

Advertisement

ఆ విధంగా కైకాల ఈ సినిమా సక్సెస్ వెనుకున్నారు.

తాజా వార్తలు