ఆర్ఆర్ఆర్ కోసం తారక్... మహాబలుడు లుక్ ఫస్ట్ లుక్ సెషన్

దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా భారీ తారాగణంతో, భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కుతున్న సంగతి అందరికి తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే రాజమౌళి ఓ వైపు కొనసాగిస్తూ మరో వైపు హీరోలని తన సినిమాలో పాత్రలకి సరిపోయే విధంగా మారడానికి టైం ఇస్తున్నాడు.

దీంతో రామ్ చరణ్, తారక్ ఇద్దరూ పాత్రల కోసం తీవ్రమైన కసరత్తులు మొదలెట్టారు.ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో తెలంగాణ మన్యం వీరుడు కొమరాభీం తరహా పాత్రలో కనిపించడానికి భారీ కసరత్తులు చేస్తున్నాడు.

Jr Ntr Show Up Beast For Rrr Training Session1-ఆర్ఆర్ఆర్ క�

తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకొని సరికొత్త లుక్ లో కనిపించడానికి రెడీ అవుతున్నాడు.పర్సనల్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ పర్యవేక్షణలో ఎన్టీఆర్ తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాడు.

లాయిడ్ గతంలో కూడా ఎన్టీఆర్ కు ఆయన పర్సనల్ ట్రైలర్ గా పనిచేసాడు.అప్పట్లో లావుగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ లుక్ ని పూర్తిగా మార్చేసిన ఘనత అతనిదే.

Advertisement

ఈ నేపధ్యంలో ఆర్ఆర్ఆర్ కోసం తారక్ మరోసారి అతనినే ఆశ్రయించాడు.ఈ నేపధ్యంలో లాయిడ్ పర్యవేక్షణలో తారక్ మహాబలుడు తరహాలో మారిపోతున్నాడు.

తాజాగా లాయిడ్ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేశారు.ఈ ఫోటోలో ఎన్టీఆర్ లెగ్ ఎక్సర్ సైజ్ చేస్తూ ఉన్నాడు.

ఫేస్ కనిపించకుండా ఈ ఫోటోను తీయడం జరిగింది.ఆ లెగ్ మజిల్స్ చూస్తే ఫుట్ బాల్ ప్లేయర్స్ లెగ్స్ తరహాలో ఉన్నాయి.

ఈ ఫోటోకు లాయిడ్ స్టీవెన్స్ ఇచ్చిన క్యాప్షన్ "ఎంతో కష్టపడి ఇది సాధించాం.కొమరం భీమ్, ఆర్ఆర్ఆర్ లెగ్ డే ని స్కిప్ చేయము అని పోస్ట్ పెట్టాడు.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
కోలీవుడ్ హీరోతో చరణ్ మల్టీస్టారర్ మూవీ... ఖుషి అవుతున్న మెగా ఫాన్స్! 

ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు