ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల పై కన్నేసిన బీజేపీ.. వ్యూహాలు ఫలిస్తాయా.. ?

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఎన్ని ప్రతికూల పరిస్దితులు ఎదురైన విజయాలను దక్కించుకుంటూ ముందుకు వెళ్లుతుందో, కేంద్రంలో కూడా బీజేపీ ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది.

ఒకవైపు గ్యాస్, పెట్రోల్, ఢీల్లీలో రైతుల సమస్యలు ఇలా ఎన్నో అనుకూలంగా లేని పరిస్దితులను ఎదుర్కొంటు తనదైన వ్యూహరచనతో గెలుస్తూ వస్తుంది.

ఇక ఈ పార్టీలకు ఇప్పటి వరకు బలమైన ప్రత్యర్ది లేకపోవడం కలిసి వచ్చే అవకాశంగా చెప్పవచ్చూ.ఇదిలా ఉండగా వ‌చ్చే ఏడాది ఉత్త‌ర‌ప్ర‌దేశ్ స‌హా ఆరు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో బీజేపీ ఇప్పటి నుండే ప్ర‌ణాళిక‌లు ర‌చించుకుంటోందట.

Bjp Jp Nadda To Review 2022 Assembly Polls Strategy, BJP, JP Nadda, Review, 2022

ఇందులో భాగంగా ఈ నెల 5, 6వ తేదీల్లో ఎన్నిక‌ల వ్యూహాల‌పై చ‌ర్చించేందుకు బీజేపీ జాతీయ‌ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల‌తో అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా స‌మావేశం కానున్నారని సమాచారం.ఇకపోతే వచ్చే సంవత్సరంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, పంజాబ్‌, గోవా, ఉత్త‌రాఖండ్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్, గుజ‌రాత్‌ లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే.

ఈ క్రమంలో ముందుగానే రాజకీయ ఎత్తులతో ప్రత్యర్ధులను చిత్తుచేయడానికి బీజేపీ రచిస్తున్న వ్యూహలు ఫలిస్తాయా లేదా చూడాలి.

Advertisement
3 సెకన్లలో మూడు దేశాలలో అడుగు పెట్టిన అమ్మాయి.. ఎలాగంటే?

తాజా వార్తలు