తన రాజకీయ భవిష్యత్తు ఎవరు నిర్ణయిస్తారో చెప్పిన జేడీ !

జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసిన వివి లక్ష్మీనారాయణ అప్పట్లో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.ఆ తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో అడుగుపెట్టారు.

2019 ఎన్నికల్లో విశాఖ ఎంపీగా జనసేన పార్టీ నుంచి లక్ష్మీనారాయణ పోటీ చేసి ఓటమి చెందారు.అయినా రాజకీయాలపై ఉన్న ఆసక్తితో విశాఖలోనే గత కొంతకాలంగా అనేక రాజకీయ సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు.2024 లోను విశాఖ నుంచి పోటీ చేసేందుకు లక్ష్మీనారాయణ ప్రయత్నాలు చేస్తున్నారు.ఏ పార్టీలోనైనా చేరినా,  చేరకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా అయిన పోటీ చేసేందుకు లక్ష్మీనారాయణ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఆయన రాజకీయ భవిష్యత్తుపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నా.లక్ష్మీనారాయణ అప్పుడప్పుడు మాత్రమే స్పందిస్తున్నారు.

తాజాగా తన రాజకీయ భవిష్యత్తుపై మరోసారి క్లారిటీ ఇచ్చారు.రాబోయే ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు.

Advertisement

ఏదైనా పార్టీ తన ఆలోచన విధానం నచ్చి వస్తే వారితో చర్చలు నిర్వహిస్తానని తెలిపారు.

మన ఎన్నికల వ్యవస్థలో ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం కూడా ఉందని లక్ష్మీనారాయణ అన్నారు.  తన రాజకీయ భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు.ఉన్నత విద్యావంతుడుగా,  నిజాయితీగల అధికారిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న లక్ష్మీనారాయణ రాజకీయాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

గతంలోనే లక్ష్మీనారాయణ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరతారని , ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారని ప్రచారం జరిగింది.అయినా లక్ష్మీనారాయణ సైలెంట్ గానే ఉన్నారు.

ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ స్థాపించిన బి.ఆర్.ఎస్ పార్టీలో చేరుతారని , ఆ పార్టీలో కీలకంగా మారుతారని ప్రచారం జరిగినా,  లక్ష్మీనారాయణ స్పందించలేదు.ఇక జనసేనలో మళ్లీ చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండగా,  లక్ష్మీనారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

స్వతంత్రంగా పోటీ చేసేందుకూ ఆయన సిద్ధంగానే ఉన్నట్టుగా చెబుతూనే.ఇప్పుడు ఈ వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు.

Advertisement

తాజా వార్తలు