Jayalalitha : బంగారం కన్నా మిన్న అయిన జయలలితకు అదొక్కటే పిచ్చి… అందుకే అన్ని కిలోలు పోగేసింది..!

జయ లలిత.( Jayalalitha ) సినిమాల్లో ఏం సంపాదించిందో లేదో కానీ రాజకీయాల్లోకి వచ్చాక కుప్పలు కుప్పలుగా బంగారు ఆభరణాలు, డబ్బులు, ప్రాపర్టీస్, చెప్పులు, వాచీలు వంటివి కోట్ల కొద్ది పోగేసింది.

పెళ్లి చేసుకుంది లేదు, పిల్లలని కనింది లేదు కానీ ఆస్తి ఎవరు అనుభవిస్తారు అనే ప్రశ్నకు చిక్కుముడి కూడా వీడడం లేదు.మేమంటే మేము అంటూ ఓవైపు జయలలిత సోదరుని కుమార్తె దీప( Deepa ) మరోవైపు దత్తత తీసుకున్న కుమారుడు కోర్టులకెక్కారు.

ఎవరి సైడు తీర్పు వస్తుందో ఏమో కానీ వాస్తవానికి రక్తం పంచుకుని పుట్టిన దీపకు కాస్త హక్కు ఎక్కువ అనేది అందరూ చెప్పే మాట.శశికళ( Sasikala ) స్వార్థం కోసమే తన కొడుకుని జయలలితకు దత్తపుత్రుడి ని చేసింది అని అందరూ ఓపెన్ గా ఒప్పుకుంటారు.

Jayalalitha Gold Is Now In Auction

ఆ మధ్య కోర్టుల చుట్టూ తిరిగిన సమయంలో ఆమె మొత్తం బంగారం( Gold ) లెక్క తేల్చడానికి కోర్టుకు నాలుగు రోజులు టైం పట్టిందట.ఇలా మొత్తంగా లెక్క తేలిన బంగారం విలువ ఏకంగా 27 కిలోలు. ఈ నెంబర్ ని బట్టే అర్థం చేసుకోవచ్చు జయలలితకు ఎంత బంగారం పిచ్చి ఉందో.

Advertisement
Jayalalitha Gold Is Now In Auction-Jayalalitha : బంగారం కన్�

రకరకాల డిజైన్లతో శరీరం నిండా అన్ని అవయవాలకు బంగారు ఆభరణాలు( Jayalalitha Gold Jewellery ) చేయించుకున్న జయలలిత బంగారం కేసులో ఇరుక్కునే సరికి ఆ కేసు తేలే వరకు బంగారు ఆభరణాలు ధరించను అంటూ శపథం చేసింది.కానీ అది ఎటు తేలలేదు.

దాంతో మెల్లిగా ఉంగరాలతో మొదలుపెట్టి చెవి కమ్మలు ఆ తర్వాత వాచీలను ఆడ్ చేస్తూ మళ్లీ బంగారం ధరించడం మొదలు పెట్టింది.

Jayalalitha Gold Is Now In Auction

శపథం మాట ఏంటి ? మళ్లి ఇలా మొదలుపెట్టారు అంటే క్యాడర్ నన్ను బోసిగా ఉంటే చూడటానికి ఇష్టపడటం లేదు అంటూ చెప్పింది.సరే ఏది ఏమైనా ఆ 27 కిలోల బంగారం కి సంబంధించిన అన్ని ఆభరణాలు ప్రస్తుతం కోర్టు వేయడం వేయాలని తేల్చేసింది.అయితే ఒక ఏడు కిలోలు మాత్రం వారసులకు అప్పగించి మిగతాదంతా వేలం వెయ్యబోతున్నారట.

ఇంతకు ఆ 7 కిలోలు ఎవరికి చెందుతుంది ? ఆ వారసులు ఎవరు ? అంటే మళ్ళీ ప్రశ్న మొదటికే వస్తుంది.ఏది ఏమైనా ముందు జయలలిత పోయింది ఇప్పుడు ఆమె ఆభరణాలు పోతున్నాయి.

విజిల్ పోడు.. పుష్ప ఎంట్రీతో అదరగొట్టిన జడ్డు భాయ్!
ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ సినిమా కోసం భారీగా కష్టపడుతున్నాడా..?

ఇక ఆమెకు సంబంధించిన జ్ఞాపకాలు ఎవరికి దొరికే అవకాశం లేదు.

Advertisement

తాజా వార్తలు