శాస్త్రవేత్తలు ఎట్టకేలకు సాధించారు... రెండు మగ ఎలుకలకు సంతానం పుట్టించారు, మనుషులదే తరువాయి?

అవును, ఆశ్చర్యపోకండి.మీరు విన్నది నిజమే.

దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందని చెప్పుకోవచ్చు.

రెండు మగ ఎలుకలకు తాజాగా సంతానం పుట్టించారు.

జపాన్​ శాస్త్రవేత్తలు పురుష జీవుల చర్మ కణాలలో నుంచి.అండాలను సేకరించి సంతానాన్ని ఉత్పత్తి చేశారు.

కాగా ఇది ఈ ప్రపంచంలోనే అరుదైన ఘనతగా చెప్పుకోవచ్చు.జపాన్‌లోని క్యుషు, ఒసాకా విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తల బృందం ఈ ఘనతను సాధించిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Advertisement

మానవులలో కొత్త సంతానోత్పత్తి చికిత్సలకు ఇది దోహదపడే అవకాశం ఉందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

లండన్​లోని ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్లో బుధవారం ఓ సమ్మిట్ జరిగింది.ఈ సందర్భంగా ఈ విషయం చెప్పుకొచ్చారు.గతంలో కూడా శాస్త్రవేత్తలు సాంకేతికంగా ఇద్దరు బయెలాజికల్​గా ఫాదర్స్ నుంచి ఎలుకను సృష్టించిన విషయం విన్నాం.

కానీ రెండు మగ ఎలుకల కణాల నుంచి అండాలను సృష్టించడం ఇదే మొదటి సారి కావడం విశేషం.ఈ ప్రక్రియ ద్వారా ఇండుసెడ్​ ప్లూరిపోటెంట్ స్టెమ్ కణాలను సృష్టించడానికి మగ చర్మ కణాలను స్టెమ్ సెల్ లాంటి స్థితికి రీప్రోగ్రామ్ చేసింది సదరు పరిశోధన బృందం.

తరువాత వై క్రోమోజోమ్​ను డిలీట్​ చేసింది.ఆ తరువాత ఎక్స్​ క్రోమోజోమ్​తో రీప్లేస్​ చేసింది.

సమంత నాగచైతన్య విడాకులకు పిల్లలే కారణమా.. అసలు విషయం బయటపెట్టిన చైతన్య?
బండిపై వెళ్తున్న అమ్మాయిలు.. లాగిపెట్టి తన్నిన గుర్రం.. వీడియో చూస్తే..

ఈ క్రమంలో వారు అనుకున్నది ఆఖరికి సాధించారు.అంటే పరిశోధనలో మగ ఎలుక చర్మ కణం నుంచి ఒక మూలకణాన్ని సృష్టించినట్టుగా తెలుస్తోంది.ఈ ప్రాసెస్ సక్సెస్ అయింది కనుక ఇదే టెక్నిక్​ను మానవులపై ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్త "హయాషి" ఈ సందర్భంగా తెలిపారు.

Advertisement

రాబోయే పది సంవత్సరాలలో ఇది సాధ్యం కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.అవి పునరుత్పత్తికి ఉపయోగపడతాయో లేదా అన్నది మాత్రం తనకు ఇంకా తెలియదని అన్నారు.

తాజా వార్తలు