హీటెక్కిస్తున్న జనసేనాని విస్సన్నపేట పర్యటన..!!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన ఏపీ రాజకీయ వర్గాల్లో హీట్ పుట్టిస్తోంది.

మూడో విడత వారాహి యాత్రలో భాగంగా ఆయన ఇవాళ అనకాపల్లి జిల్లాలోని విస్సన్నపేట పర్యటన కొనసాగుతోంది.

ఇందులో భాగంగా విస్సన్నపేటలో భూములను జనసేనాని పవన్ పర్యటించనున్నారు.కాగా అక్కడ సుమారు ఆరు వందల భూమి కబ్జా చేశారని జనసేన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.

వైసీపీ మంత్రి అమర్నాథ్ బినామీల పేరుతో కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు జనసేన నేతలు.అయితే దీనిపై స్పందించిన మంత్రి అమర్నాథ్ నిరూపిస్తే జనసేనకే రాసిస్తానంటూ కౌంటర్ ఇచ్చారు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో పవన్ కల్యాణ్ విస్సన్న పేట పర్యటన పొలిటికల్ హీట్ పెంచుతోంది.

Advertisement
పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం..!!

తాజా వార్తలు