ప్రజారాజ్యం గెలిచిన సీట్లే మాకు కావాలి ... వైసీపీతో జనసేన మంతనాలు !

జనసేన -వైసీపీ పొత్తు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది.

మొన్నటి వరకూ మాటల యుద్ధంతో కత్తులు నూరుకున్న ఇరు పార్టీల నేతలు ఇప్పుడు ఒకరినొకరు విమర్శించుకోవడం తగ్గించారు.

ఈ రెండు పార్టీలు పొత్తు దిశగా అడుగులు వేస్తుండడంతో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి.ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని కానిచ్చే పరిస్థితి లేదని.

అవసరమైతే అందుకోసం వైసీపీతో పొత్తులు పెట్టుకుంటామని పవన్ తన సన్నిహితుల వద్ద చెబుతున్నట్టు తెలుస్తోంది.

వైసీపీతో పొత్తు కుదిరితే.2009లో ప్రజారాజ్యం పార్టీ విజయం సాధించిన స్థానాలతో పాటు.రెండో స్థానంలో నిలిచిన స్థానాలను అడగాలని జనసేన భావిస్తోందట.

Advertisement

దీనిపై సుధీర్ఘంగా కసరత్తులు చేస్తున్నారట.ఇప్పటి వరకు వివిధ జిల్లాల్లో పవన్‌ చేసిన పర్యటనలో కేవలం ఆయన సామాజిక వర్గానికి చెందిన మెజార్టీ యువ నేతలే హాజరవుతున్నారని, మిగతా సామాజిక వర్గాలకు చెందిన వారు తక్కువగా హాజరవుతున్నారని ఆ పార్టీ నేతల దృష్టికి వచ్చింది.

కాపుల్లో పూర్తిస్థాయి పట్టుకోసం జనసేన నాయకులు చేస్తున్న ప్రయత్నాలు ఎప్పటికప్పుడు విఫలం అవుతూనే ఉన్నాయి.

2009లో విజయం సాధించిన నియోజకవర్గాలు, రెండో స్థానంలో వచ్చిన స్థానాలు జనసేనకు ఇస్తే జగన్‌తో పొత్తు కుదురుతుందని పవన్‌ చెబుతున్నారట.కానీ.పవన్‌తో పొత్తుకు జగన్‌ అంగీకరించే పరిస్థితి లేదని చెబుతున్నారు.

జగన్‌పై కాపుల్లో ఉన్న వ్యతిరేకతను మళ్లించడానికి పవన్‌ చేస్తోన్న ప్రయత్నాలు ఫలించడం లేదు.ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో పవన్‌పై ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం.. బాబుకు భలే షాకిచ్చారుగా!

ఆయనపై ఉన్న అభిమానం ఓట్లుగా మారుతాయా.? లేక సినీ అభిమానంగానే మిగిలిపోతుందా.? చంద్రబాబును రాజకీయంగా కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టాలనే భావనతో పవన్‌ ఉన్నారు.ఏదో విధంగా ఎవరినైనా అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనతో జగన్‌ ఉన్నారు.

Advertisement

అయితే ఈ పొత్తు వ్యవహారం ఎప్పటికి క్లారిటీ వస్తుందో ఇద్దరికీ అర్ధం కావడంలేదు.

తాజా వార్తలు