మారుతున్న పవన్ తీరు ?

ఎన్డీఏ( NDA ) కూటమి పార్టీల సమావేశానికి హాజరై తిరిగి వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ వైఖరిలో కొంత మార్పు కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం పై పొత్తు పై స్పష్టంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పొత్తు చారిత్రక అవసరమని వ్యాఖ్యానించేవారు .

అంతేకాకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అని పలుమార్లు అనేక వేదికలపై కూడా పవన్ ప్రకటించారు.దాంతో తెలుగుదేశంతో జనసేన పొత్తు ఖచ్చితమని, సీట్ల సర్దుబాటుపై కొంత మల్లగుల్లాలు పడినా అంతిమంగా పొత్తు ఏర్పడి తీరుతుందని విశ్లేషణలు వినిపించాయి.

దానికి తగ్గట్టుగానే తెలుగుదేశం అనుకూల మీడియా నుంచి పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ వరకూ అందరూ పవన్ కు మద్దతు ఇచ్చి మాట్లాడేవారు.పవన్ పై ప్రభుత్వం చేసిన విమర్శలను ఖండించేవారు.

తద్వారా రెండు పార్టీలు ఒక లైన్ లో ఉన్నాయి అన్న ఫీలింగ్ను తెలుగు రాష్ట్రాలలో కల్పించగలిగారు.

Advertisement

అయితే పరిస్థితుల్లో క్రమంగా కొంత మార్పు వస్తున్న వాతావరణం కనిపిస్తున్నదని ఎన్డీఏ ఏర్పాటు తరువాత బిజెపి పెద్దలతో సమావేశమైన పవన్ కు వారు హితబోధ చేశారని ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ వ్యాక్యూమ్ ఏర్పడాలంటే రెండు ప్రధాన పార్టీలు ఒకటి కావ్వాలని ,తెలుగుదేశం( TDP ) జనసేన సాంప్రదాయక ఓటింగ్ ఒకే విధంగా ఉంటుంది కాబట్టి తెలుగుదేశం ఖాళీ అయితేనే జనసేన- బిజెపి కూటమి( Janasena BJP ) ఆంధ్ర ప్రదేశ్ లో బలపడడానికి అవకాశం ఉంటుందని, మైనారిటీలు దళితుల ఓటింగ్ ఎక్కువగా వైయస్సార్ పార్టీ వైపు ఉన్నందున వారిని ఆకట్టుకోవటం కష్టమని భావిస్తున్న భాజపా తెలుగుదేశం మద్దతుదారులైన బీసీ ఓట్లను, కమ్మ ఓట్లను తమ వైపు తిప్పుకుంటే కాపు సామాజిక వర్గం మద్దతు ఎలాగో ఉంది కాబట్టి వచ్చే ఎన్నికల నాటికి బలమైన ఫోర్సుగా నిలబడతామన్న సూచనలతోనే పవన్ మాటతీరు మారిందని కూడా కొంతమంది అంచనా వేస్తున్నారు.

ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత పవన్ వైసీపీ( YCP ) వ్యతిరేక ఓటు చీలకూడదు అనే మాట ఒకసారి కూడా మాట్లాడకపోవటం దీనికి నిదర్శనమని , జగన్ పోవాలి ఎన్డీఏ రావాలి అనే కొత్త స్లోగను పవన్ అందుకున్నారని విశ్లేషణలు వస్తున్నాయి.తద్వారా మెల్లగా తెలుగుదేశంపై పవన్ ఆలోచన మారుతుందని ఒకవేళ పొత్తు ఉన్నా కూడా తన మాట నెగ్గేలా వాతావరణం ఉంటేనే పవన్ దానిని ఫైనల్ చేస్తారని లేకపోతే సీఎం సీటు( AP CM Post )కు ఎలాగో దూరంగా ఉన్నారు కనుక వచ్చే ఎన్నికల వరకు ఎదురు చూస్తారని కీలకమైన కొన్ని సీట్లను గెలిపించుకొని అసెంబ్లీలో తన ముద్ర ఉండేలా జాగ్రత్త పడతారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు