ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కే’ పై డౌట్ అస్సలు అక్కర్లేదు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా రూపొందుతున్న ప్రాజెక్టు కే సినిమా టైటిల్ ని కల్కీ 2898 AD ( Kalki 2898 AD ) అంటూ అధికారికంగా ప్రకటించడం తో అంచనాలు భారీగా పెరిగాయి.సినిమా ఫస్ట్ లుక్ విడుదలైన సమయం లో దర్శకుడు నాగ్‌ అశ్విన్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులందరికీ కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి.

 Prabhas Nag Ashwin Project K Movie Talk,prabhas,nag Ashwin,project K,kalki 2898a-TeluguStop.com

ఆ విమర్శలకు సమాధానం అన్నట్లుగా టీజర్ ఉండడం తో ప్రభాస్( Prabhas ) అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా సినిమా పై ఎలాంటి అనుమానం అక్కర్లేదు అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు.

కచ్చితంగా ఈ సినిమా తెలుగు సినిమా స్థాయిని పెంచే విధంగా ఉంటుందని తెలుగు సినిమా వాళ్లు మాత్రమే కాకుండా ఇండియన్ సినీ ప్రేక్షకులంతా కూడా ఇది మా ఇండియన్ సినిమా అన్నట్లుగా గర్వంగా చెప్పుకునే సినిమా అవుతుందని యూనిట్ సభ్యులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమా లో ప్రభాస్ కి జోడి గా దీపికా పదుకొనే( Deepika Padukone ) హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.మరో బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ ఈ సినిమా లో కనిపించబోతోంది.

ఇక బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్, కోలీవుడ్ స్టార్ హీరో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్( Kamal Haasan ) ఈ సినిమా లో ముఖ్య పాత్రలో నటించడం వల్ల సినిమా స్థాయి అని పెరిగింది అనడంలో సందేహం లేదు.దాదాపుగా 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా కు సంబంధించిన విడుదల తేదీ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.వచ్చే సంవత్సరం సంక్రాంతి కి ఈ సినిమా విడుదల అవ్వాల్సి ఉంది.కానీ గ్రాఫిక్స్ వర్క్ తో పాటు షూటింగ్ బ్యాలెన్స్ ఉండడం వల్ల సినిమా ను వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube