సీఎం వైఎస్ జగన్ కి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ నాగబాబు సెటైర్లు..!!

నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి( CM YS Jagan) పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వైసీపీ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు కేక్ కటింగ్ కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది.

ఇదే సమయంలో చాలామంది ప్రముఖులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు ముఖ్యమంత్రి జగన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఈ రకంగానే జనసేన పార్టీ నాయకుడు నాగబాబు(Nagababu ) కూడా ట్విట్టర్ లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెటైర్లు వేశారు.

Janasena Leader Nagababu Satires By Conveying Birthday Wishes To CM YS Jagan Jan

"సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు.కర్నూల్ మల్లికార్జున స్వామి, విశాఖ సింహాద్రి అప్పన్న స్వామి, విజయవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులు మీకు మెండుగా ఉండాలి.

రాజధాని ఎక్కడో త్వరగా నిర్ణయించుకుంటే ఆ ప్రాంతాల దేవతల ఆశీస్సులు మీకు ఇంకా ఎక్కువగా ఉంటాయి." అని ట్వీట్ చేశారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ(Narendra Modi ) ఇంకా చాలామంది ప్రముఖులు సీఎం జగన్ కి విషెస్ తెలియజేశారు.2024 ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన పార్టీల మధ్య మంచి పోటీ ఉంది.ఇంకా ఎన్నికలకు మూడు నెలలు మాత్రమే టైం ఉండటంతో.

Advertisement

అధికార విపక్ష పార్టీల మధ్య మాటల తుటాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి.దీంతో నాగబాబు పెట్టిన ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

విజయ్ దేవరకొండ ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోలను లైన్ లో పెట్టాడా..?
Advertisement

తాజా వార్తలు