మైగ్రేన్‌కు బెల్లంతో చెక్ పెట్టేయండిలా!

మైగ్రేన్ తలనొప్పి.నేటి ఉరుకుల ప‌రుగుల జీవితంలో చాలా మంది ఈ స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతున్నారు.

ఈ మైగ్రేన్ చాలావరకు తలకు ఒక సైడే వస్తుంటుంది.ఒక్కోసారి రెండు వైపులా కూడా వ‌స్తుంది.

Jaggery Helps To Get Rid Of Migraine! Jaggery, Migraine, Latest News, Health Tip

ఇది మ‌రింత తీవ్రంగా ఉంటుంది.మైగ్రేన్ త‌ల‌నొప్పి రావ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి.

మానసిక ఆందోళ‌న‌, ఒత్తిడి, ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న శైలి, నిద్ర‌లేమి ఇలా చాలా కార‌ణాల వ‌ల్ల మైగ్రేన్ త‌ల‌నొప్పి వ‌స్తుంది.ముఖ్యంగా పురుషుల‌తో పోలిస్తే.

Advertisement

స్త్రీలలో ఇది ఎక్కువ‌గా క‌నిపిస్తుంది.సాధార‌ణంగా ఈ మైగ్రేన్ త‌ల‌నొప్పి రెండు గంట‌ల నుంచి రెండు, మూడు రోజుల వ‌ర‌కు ఉంటుంది.

ఈ ద‌శ‌లో వాంతులు కూడా అవుతుంటాయి.ఈ మైగ్రేన్ త‌ల‌నొప్పిని భ‌రించ‌డం కాస్త క‌ష్ట‌మ‌నే చెప్పాలి.

అయితే మైగ్రేన్‌ను త‌గ్గించ‌డంలో బెల్లం అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.అవును, ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్న బెల్లంను తాత‌ల కాలం నుంచి ఉప‌యోగిస్తున్నారు.

గుండె జ‌బ్బుల నుంచి ర‌క్షించ‌డంలోనూ, శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెంచ‌డంలోనూ, జీర్ణ స‌మ‌స్య‌ల‌ను దూరం చేయ‌డంలోనూ, ర‌క్త వృద్ధి చేయ‌డంలోనూ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డే బెల్లం మైగ్రేన్ స‌మ‌స్య‌ను కూడా త‌గ్గించ‌గ‌ల‌దు.గోరు వెచ్చ‌ని ఆవు పాలలో బెల్లం కలిపి తాగాలి.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023

ఇలా చేయ‌డం వ‌ల్ల మైగ్రేన్, దీర్ఘకాలిక తలనొప్పి నుంచి సులువుగా ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.అయితే బెల్లంను అధికంగా మాత్రం తీసుకోరాదు.

Advertisement

ఎందుకంటే, బెల్లంను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల.అందులో ఉండే ఫ్రక్టోజ్, గ్లూకోజ్‌లతోపాటు కొవ్వులు, ప్రోటీన్లు బ‌రువు పెరిగేలా చేస్తాయి.

మ‌రియు మ‌రిన్ని అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా తెచ్చిపెడుతుంది.ఇక మైగ్రైన్ త‌గ్గించ‌డంలో అల్లం ర‌సం కూడా అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

మైగ్రైన్ స‌మ‌స్య‌తో బాధ పడుతున్న‌ప్పుడు అల్లం రసంను నిమ్మ‌ర‌సంతో క‌లిసి తీసుకుంటే మంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

తాజా వార్తలు