యుద్దానికి జగన్ ' సిద్ధం ' ... వారిలో ఆలోచన రేకెత్తెలా 

నిన్న జరిగిన భీమిలి యుద్ధం సభలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ( AP CM Jagan )అన్ని విషయాలపైన క్లారిటీ ఇచ్చారు.

ముఖ్యంగా వైసిపికి( YCP ) ఎందుకు ఓటు వేయాలనే విషయంలో ఆలోచన రేకెత్తించేలా మాట్లాడారు.

ప్రధాన ప్రతిపక్షం టిడిపి కి ఓటు వేస్తే ఏం జరగబోతుందో చెప్పి జనాలను వైసీపీకి మరింత దగ్గర చేసే విధంగా వ్యవహాత్మకంగా జగన్ ప్రసంగించారు.తాము బలంగా ఉన్నాము కాబట్టే ,తమను ఎదుర్కోలేక టిడిపి మిగతా అన్ని పార్టీలతోనూ పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తుందని జగన్ ఎద్దేవా చేశారు.

ఇక్కడ ఉంది అభిమన్యుడు కాదని, అర్జునుడు అంటూ ప్రసంగించారు.కురుక్షేత్ర యుద్ధంలో గెలుపు ఈసారి కూడా మనదేనంటూ ప్రసంగించారు.

చంద్రబాబు తో పాటు, మిగతా అందరిని ఓడించాల్సిందేనని కొత్త వాగ్దానాలతో గారడీ చేయాలని బాబు చూస్తున్నారని, 75 ఏళ్ళ వయస్సు మళ్ళిన నాయకుడు అంటూ విమర్శలు చేశారు.

Jagan siddam For War How To Stir Up The Thought Among Them, Jagan, Ysrcp, Ap C
Advertisement
Jagan 'siddam' For War How To Stir Up The Thought Among Them, Jagan, Ysrcp, Ap C

ఈ ఎన్నికలు మోసం, విశ్వసినీతకు మధ్య జరుగుతుందని, అటువైపు కౌరవ సైన్యం ఉందని, ఇటు పాండవులు ఉన్నారని, ఈ అర్జునుడికి తోడుగా ప్రజలు ఉన్నారంటూ జగన్ ఆకట్టుకునే విధంగా ప్రసంగించారు.ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేసిన మంచి పనిని పార్టీ నాయకులు చెప్పాలని, మనల్ని మనం చేసిన మంచి పనులే గెలిపిస్తాయని అన్నారు.చంద్రబాబు దత్తపుత్రుడును వెంటేసుకుని తిరుగుతున్నాడు అంటూ జగన్ సెటైర్లు వేశారు.2014 ఎన్నికల సమయంలో టిడిపి 670 వాగ్దానాలు ప్రకటించి అధికారంలోకి వచ్చాక 10% కూడా అమలు చేయలేదని, మనం మేనిఫెస్టో లో పెట్టిన ప్రతి అంశాన్ని అమలు చేసి, చిత్తశుద్ధి చాటుకున్నామని జగన్ అన్నారు.

Jagan siddam For War How To Stir Up The Thought Among Them, Jagan, Ysrcp, Ap C

వైసీపీ ప్రభుత్వంలో లంచాలు, వివక్షకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, ఎప్పుడూ లేనివిధంగా సామాజిక న్యాయం అందిస్తున్నామని జగన్ తెలిపారు.70% ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల కే ఇచ్చామని, కానీ ఎస్సీ లుగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు అంటూ ప్రజలకు గుర్తు చేశారు.ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చిన ఘనత కూడా వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని జగన్ అన్నారు.

ఈ సందర్భంగా ప్రజలలో ఆలోచన రేకెత్తే విధంగా గత టిడిపి ప్రభుత్వ వైఫల్యాలను జగన్ హైలెట్ చేశారు.చంద్రబాబు రుణమాఫీ చేస్తానని ప్రజలను మోసం చేశాడని, వైసిపి అందరి పార్టీ అని జగన్ అన్నారు.

వైసిపికి మళ్లీ ఓటు వేయకపోతే ప్రస్తుతం అమలవుతున్న అన్ని సంక్షేమ పథకాలను రద్దు చేస్తారంటూ జగన్  మాట్లాడారు.

రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...
Advertisement

తాజా వార్తలు