తెలుగులో నటించింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న సమీరా రెడ్డి వేర్వేరు కారణాల వల్ల టాలీవుడ్ కు దూరమైన సంగతి తెలిసిందే.చిరంజీవితో జై చిరంజీవ సినిమాలో నటించిన సమీరా రెడ్డి, తారక్ తో నరసింహుడు, అశోక్ సినిమాల్లో నటించారు.
ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.తాజాగా ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన సమీరా రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
టీనేజ్ లో ఉన్న సమయంలో దిగిన ఓ ఫోటోను షేర్ చేసిన సమీరా ఆ ఫోటోపై వ్యక్తమైన కామెంట్ల గురించి చెబుతూ తాను టీనేజ్ లో ఉన్న సమయంలో లావుగా ఉండేదానినని అన్నారు.లావుగా కనిపించడం వల్ల అందరూ తనపై నెగిటివ్ కామెంట్లు చేసేవాళ్లని ఆమె పేర్కొన్నారు.
ఎవరైనా శరీరం ఆకృతి గురించి కామెంట్లు చేస్తే ఆ కామెంట్లను తట్టుకోవడం తేలిక కాదని సమీరారెడ్డి అన్నారు.
ఓర్పుతో సమాజంలో మనం ప్రతి విషయాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని.ఇతరులు ఎలా ఉన్నా ఒకే విధంగా చూడాలని తాను తన పిల్లలకు నేర్పుతానని సమీరా రెడ్డి అన్నారు.2013 సంవత్సరం వరకు సినిమాలతో బిజీగా ఉన్న సమీరా రెడ్డి వేర్వేరు కారణాల వల్ల సినిమాలకు దూరమయ్యారు.సినిమాల్లోకి సమీరారెడ్డి మళ్లీ రీఎంట్రీ ఇచ్చి వరుస ఆఫర్లతో బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.
ఎప్పుడూ సరదాగా ఉంటే ఫన్నీ వీడియోలు, పోస్టులు చేసే సమీరా ఎమోషనల్ పోస్ట్ అకస్మాత్తుగా పెట్టడానికి కారణం తెలియాల్సి ఉంది.
భర్తతో వివాహం తరువాత సమీరా రెడ్డి సినిమాలకు గుడ్ బై చెప్పారు.క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కి రానా హీరోగా నటించిన కృష్ణం వందే జగద్గురుం అనే సినిమాలో సమీరారెడ్డి స్పెషల్ సాంగ్ చేశారు.