Elome Agbegninau Columbus: ఇదేందయ్యా ఇది.. దేవుడు చెప్పాడని విమానం డోర్ తెరిచేందుకు సిద్ధమైన మహిళ..

దేవుడిపై భక్తి ఉండాలి.కానీ భక్తి అనే పేరుతో భ్రమలోకి వెళ్ళిపోయి, వాస్తవాన్ని గ్రహించలేక మూర్ఖపు పనులు చేయకూడదు.

అలా చేస్తే ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయం.కాగా తాజాగా ఇలాంటి పిచ్చి భక్తి ఉన్న ఒక యువతి తనతో పాటు అందరి ప్రాణాలను రిస్కులో పడేసింది.

ఏసుప్రభువు చెప్పాడని ఆమె 37 వేల అడుగుల ఎత్తులో విమానం డోర్ తీయడానికి ప్రయత్నించింది.ఈ దృశ్యాలు చూసిన తోటి ప్రయాణికులు భయంతో హడలి చచ్చారు.

విమానం డోర్ తీయొద్దని ఆమెను బతిమిలాడుకున్నారు.అందరూ ఆపేందుకు ప్రయత్నించగా ఆమె వారిపై దాడి కూడా చేసింది.

Advertisement

ఏసు ప్రభువు చెప్పాడని చెబుతూ ఎమర్జెన్సీ డోర్ లాగేందుకు ఆమె శత విధాలా ప్రయత్నించింది.ఆమె పేరు ఎలోమ్ అగ్బెగ్నినౌ, వయసు 34 ఏళ్లు.

ఈ షాకింగ్ ఘటన నవంబర్ 20వ తేదీన టెక్సాస్‌లోని హ్యూస్టన్ నుంచి కొలంబస్, ఒహియోకి వెళ్తున్న సౌత్ వెస్ట్ ఫ్లైట్ 192లో వెలుగు చూసింది.విమాన సిబ్బంది ఆమెను ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ వద్దకు చేరుకోకుండా అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నం చేసింది.

అయినా కూడా ఆమె ఆగకుండా అటువైపే వెళ్తుండగా ప్రయాణికులు కూడా అడ్డగించాల్సి వచ్చింది.ఆ క్రమంలో ఆ మహిళ ప్రయాణికులపై విచక్షణారహితంగా అటాక్ చేసింది.

ఒక ప్యాసింజర్ తొడను గట్టిగా కొరికేసింది.

ప్రభాస్ రాజాసాబ్ సినిమా రిలీజ్ కి రంగం సిద్ధం చేస్తున్నారా..?
బిజీ రోడ్డుపై రాంగ్ రూట్‌లో పిల్లాడు బైక్ రైడింగ్.. తర్వాతేం జరిగిందో మీరే చూడండి!

ఎగ్జిట్ డోర్ తెరవడానికి ఎవరు కూడా తనను అనుమతించడం లేదని ఆమె బాగా బాధపడిపోయింది.అంతేకాదు విమానం ఫ్లోర్ కేసి తన తలను బలంగా కొట్టుకోవడం ప్రారంభించింది.ఆమె ప్రవర్తనకు బాగా భయపడి పోయిన విమాన సిబ్బంది చివరకు విమానాన్ని లిటిల్ రాక్ లోని బిల్-హిల్లరీ క్లింటన్ నేషనల్ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

Advertisement

తర్వాత ఆమెపై కేస్ ఫైల్ చేసి పోలీసులకు అప్పచెప్పారు.విచారణ సమయంలో ఆమె చెప్పిన మాటలు విని పోలీసులతో సహా అందరూ స్టన్ అయ్యారు.ఆమె మాట్లాడుతూ.

ఏసు తనను ఒహియోకు వెళ్లమని చెప్పాడు.విమానం డోర్ కూడా ఓపెన్ చేయాలని కోరాడు.

దేవుడాజ్ఞ పాటించాలని నేను డోర్ తెరవడానికి ప్రయత్నిస్తే వారు ఒప్పుకోలేదు. అని చెప్పింది.

ఆమె సమాధానం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరిని నోరెళ్లబెట్టేలా చేస్తుంది.

తాజా వార్తలు