Actress Mahalaxmi First Husband: సీరియల్ నటి మహాలక్ష్మి మొదటి భర్తతో విడిపోవడానికి అదే కారణమా.. వైరల్ అవుతున్న న్యూస్?

కోలీవుడ్ సీరియల్ నటి మహాలక్ష్మి గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.

ఈమె కోలీవుడ్ నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ ను రెండవ వివాహం చేసుకోవడంతో ఈమె గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

చూడటానికి అధిక శరీర కాయంతో ఉన్నటువంటి రవీందర్ చంద్రశేఖర్ ను రెండవ వివాహం చేసుకోవడానికి గల కారణం కేవలం తన ఆస్తి కోసమే అతనిని పెళ్లి చేసుకుందంటూ పెద్ద ఎత్తున వీరి గురించి వీరి పెళ్లి గురించి వార్తలు వచ్చాయి.ఈ విధంగా వీరిద్దరి గురించి ఈ విధమైనటువంటి వార్తలు రావడంతో ఈ వార్తలను రవీందర్ మహాలక్ష్మి దంపతులు కొట్టి పారేశారు.

అయితే ఈమె కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సీరియల్స్ లో నటించి నటిగా గుర్తింపు పొందారు.ఇలా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే మహాలక్ష్మి అనిల్ నేరేడుమిల్లి అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.

ఈ దంపతులకు ఓ కుమారుడు కూడా ఉన్నారు.అయితే ఆమె తనకు విడాకులు ఇచ్చి తిరిగి రవీందర్ చంద్రశేఖర్ ను రెండవ వివాహం చేసుకున్నారు.

Advertisement
Is That The Reason Why Serial Actress Mahalakshmi Broke Up With Her First Husban

ఈ విధంగా మహాలక్ష్మి తన మొదటి భర్తకు విడాకులు ఇవ్వడానికి గల కారణం ఈమె మరొక నటుడు ఈశ్వర్ అనే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుందన్న కారణంతోనే అనిల్ తనని వదిలేసారనే వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి.

Is That The Reason Why Serial Actress Mahalakshmi Broke Up With Her First Husban

ఈ విషయం గురించే తరచూ వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడం చేత విసిగిపోయిన మహాలక్ష్మి తనకు విడాకులు ఇచ్చిందని అలాంటి సమయంలోనే రవీందర్ తనకు దగ్గరయ్యి ఆ కష్ట సమయంలో తనకు ఎంతో అండగా ఉన్నారని మహాలక్ష్మి వెల్లడించారు.ఇకపోతే తను కేవలం డబ్బు కోసం మాత్రమే రవీందర్ ను పెళ్లి చేసుకున్నాను అంటూ వచ్చిన వార్తలను కూడా ఈమె ఖండించారు.ప్రస్తుతం తాను నెలకు 3 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని ఇంకా డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి కానీ డబ్బు కోసమే తనని పెళ్లి చేసుకోలేదంటూ కొట్టి పారేశారు.

Advertisement

తాజా వార్తలు