కన్నడ హీరో రిషబ్ శెట్టి హీరోగా ఆయన దర్శకత్వంలోనే తెరకెక్కిన చిత్రం కాంతార.కర్ణాటక కేరళ ఆదివాసిల భూత కోల సాంప్రదాయాన్ని చూపిస్తూ ఈ సినిమాని రిషబ్ శెట్టి ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పాలి.
ఈ విధంగా కాంతర సినిమా కన్నడ చిత్ర పరిశ్రమలో విడుదలై అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషలలో కూడా విడుదల చేశారు.ఇలా ప్రతి ఒక్క భాషలోనూ ఎంతో అద్భుతమైన ఆదరణ సంపాదించుకున్న ఈ సినిమాపై ఎంతో మంది సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు ప్రశంసలు కురిపించారు.
ఇకపోతే కాంతార సినిమా పై క్రికెటర్లు సైతం స్పందిస్తూ సినిమా గురించి మాట్లాడుతూ పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ కాంతార చిత్రంపై ఆసక్తికర కామెంట్స్ చేయడమే కాకుండా స్వయంగా ఆయనను కలిసి సినిమా గురించి ముచ్చటించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం వీరిద్దరూ కలిసి మాట్లాడుతూ ఉన్నటువంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇకపోతే ఈ ఇద్దరు బెంగుళూరు స్టార్ ఏబీ డివిలియర్స్ కలుసుకున్నారు.
ఈ సందర్భంగా రిషబ్ శెట్టిని కలిసినటువంటి క్రికెటర్ సినిమా ఎంతో అద్భుతంగా ఉంది అంటూ సినిమాపై ప్రశంసలు కురిపించారు.ఇలా రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిపించగా ప్రస్తుతం క్రికెటర్లు సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.అత్యంత తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తూ అద్భుతమైన కలెక్షన్లను రాబడుతోంది.