కోలీవుడ్ స్టార్ హీరోల్లో రజనీ కాంత్ ఒకరు.ఈయనకు టాలీవుడ్ లో మాత్రమే కాదు.
ఇండియా వైడ్ ఫాలోయింగ్ ఉంది.ఈయన ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.
వరుస ప్లాప్స్ వస్తున్న ఈయన సినిమా వస్తుంది అంటే క్రేజ్ వేరే లెవల్ లో ఉంటుంది.సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈయన బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు.
ప్రెసెంట్ రజనీ కాంత్ ‘జైలర్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఇటీవలే ఈ సినిమా నుండి పోస్టర్ రివీల్ చేసారు మేకర్స్.ఈ మాస్ పోస్టర్ సోషల్ మీడియాలో భారీ క్రేజ్ తెచ్చుకుంది.నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ సినిమాలో తమన్నా, రమ్య కృష్ణ కూడా నటిస్తున్నట్టు ఇప్పటికే కన్ఫర్మ్ చేసారు.ఇక ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తుండగా.
భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.
ఈ సినిమా చేస్తూనే తన నెక్స్ట్ లైనప్ కూడా రజినీకాంత్ సెట్ చేసుకుంటున్నారు.
గత కొన్ని రోజుల ఈయన గురించి ఒక రూమర్ వినిపిస్తుంది.ఈయన ఒక సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించ బోతున్నారు అంటూ టాక్ బాగా వైరల్ అయ్యింది.
మరి ఈ టాక్ అప్పటి నుండి రూమర్ గానే మిగిలి పోయింది.కానీ ఇన్ని రోజులకు ఈ వార్త నిజమే అంటూ క్లారిటీ వచ్చేసింది.
రజనీకాంత్ నిజంగానే ఒక సినిమాలో గెస్ట్ రోల్ పోషిస్తున్నాడని తెలుస్తుంది.

తమిళ్ హీరో విష్ణు విశాల్ నటిస్తున్న లేటెస్ట్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా లాల్ సలాం.ఈ సినిమాను రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్ట్ చేస్తుంది.ఈ మేరకు కొద్దిసేపటి క్రితమే ప్రొడక్షన్ హౌస్ వారి నుండి అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది.
దీంతో కూతురు దర్శకత్వంలో రజనీకాంత్ మరోసారి నటించబోతున్నాడు. మరి కూతురు కోసం రజినీకాంత్ ఈ సినిమాలో క్యామియో రోల్ చేసేందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.
ఈ సినిమాకు ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తుండగా లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు.చూడాలి కూతురు తండ్రి కోసం ఎలాంటి రోల్ సిద్ధం చేసిందో.