పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న లేటెస్ట్ సినిమా ఆదిపురుష్.ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపు కుంటున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా నుండి ఇటీవలే టీజర్ వచ్చింది.ఈ టీజర్ తర్వాత ఈ సినిమాపై చాలానే ట్రోల్స్ వచ్చాయి.కానీ మేకర్స్ ఏ మాత్రం పట్టించు కోకుండా సినిమా పనులను పూర్తి చేస్తున్నారు.
రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించారు.
ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తుంటే.సీతగా కృతి సనన్ నటిస్తుంది.
ప్రభాస్ మొదటిసారి బాలీవుడ్ డైరెక్ట్ సినిమాతో అడుగు పెట్టబోతున్నాడు.ఆదిపురుష్ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ ఖర్చుతో నిర్మించారు.
ఈ భారీ ప్రాజెక్టులో చాలా మంది నటీనటులు భాగం అయ్యారు.లంకేశ్వరుడు రావణాసురిడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండగా.లక్ష్మణుడిగా బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ నటిస్తున్నాడు.ఇదిలా ఉండగా ఈ సినిమాపై గత కొన్ని రోజులుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి.
ఈ సినిమా రీ షూట్ జరుగుతుంది అని.సినిమా వాయిదా పడింది అని తెగ వైరల్ న్యూస్ లు వస్తున్నాయి.
అయితే ఈ రూమర్స్ లో ఒక రూమర్ నిజం కాదు అని తెలుస్తుంది.ఈ సినిమాకు ప్రెజెంట్ కేవలం వి ఎఫ్ ఎక్స్ వర్క్ మాత్రమే జరుగుతుంది అని రీ షూట్ వంటిది ఏమీ జరగడం లేదు అని సమాచారం అందుతుంది.
దీంతో ఈ రూమర్స్ కు చెక్ పడింది.ఇక ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుందో లేదో క్లారిటీ ఇచ్చి కొత్త రిలీజ్ డేట్ ఇస్తే ఫ్యాన్స్ కూడా ఆందోళన లేకుండా ఉంటారు.
మరి ఓం రౌత్ ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో.







