ఇక వెంకటరెడ్డి పని అంతేనా ? కాంగ్రెస్ పట్టించుకోనట్టేనా ? 

తెలంగాణ కాంగ్రెస్ లో కీలక నాయకుడిగా,  పార్టీ లో సీనియర్ నేతగా ఉన్న భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఆయనకు మొదటి నుంచి ఉన్న ప్రాధాన్యం ఇప్పుడు కనిపించడం లేదు.

ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా వెంకట్ రెడ్డి వ్యవహరించిన తీరు తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో పాటు , ఆ పార్టీ అధిష్టానానికి తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది.ఈ క్రమంలోనే తాజాగా ఏ ఐ సీసీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని ప్రకటించింది .ప్రధాన కార్యదర్శిగా 84 మంది , ఉపాధ్యక్షులుగా 24 మంది ,ఎగ్జిక్యూటివ్ కమిటీలో 40 మందితో పాటు,  26 జిల్లాలకు కొత్తగా అధ్యక్షులను నియమించింది .ఇంత  భారీగా నియమించిన లిస్టులో ఎక్కడా వెంకటరెడ్డి పేరు లేకపోవడంతో,  ఆయనను పూర్తిగా కాంగ్రెస్ అధిష్టానం పక్కన పెట్టేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.         ముఖ్యంగా మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా వెంకటరెడ్డి వ్యవహరించిన తీరే దీనికి కారణం అని తెలుస్తోంది.

ఇప్పటికే ఆయనకు షోకాజ్ నోటీసులను జారీ చేశారు.దీనికి ఆయన ఏ సమాధానం చెప్పారనేది క్లారిటీ లేనప్పటికీ , పార్టీ వ్యవహారాలకు ఆయన దూరంగానే ఉంటున్నారు.

ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం కూడా ఊపు అందుకుంది.   

Advertisement

   అయితే రాబోయే ఎన్నికల్లో ఆయన ఏదైనా పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేస్తారా,  లేక పూర్తిగా రాజకీయాలకు దూరమవుతారా అనేది స్పష్టత లేదు.ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో వెంకటరెడ్డికి అంత సఖ్యత లేదు.మొదటి నుంచి రేవంత్ ను ఆయన వ్యతిరేకిస్తూనే వస్తున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష రేసులోనూ రేవంత్ పోటీపడ్డారు.కానీ అధిష్టానం రేవంత్ వైపే మొగ్గు చూపడంతో అప్పట్లోనే ఆయన అసంతృప్తి చెందారు.

ఇక ఇప్పుడు మునుగోడులో వ్యవహరించిన తీరుతో కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో కూడా ఆయన చెడ్డ పేరు తెచ్చుకోవడంతో, ఆయనకు పార్టీలో ప్రాధాన్యం కరువైంది.

రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?
Advertisement

తాజా వార్తలు