అధిక బరువుకు అతి ఆకలి కూడా ఒక కారణం.అధిక ఆకలి కారణంగా ఏది పడితే అది లాగించేస్తుంటారు.
ఫలితంగా క్యాలరీలు పెరిగి వెయిట్ గెయిన్ అవుతారు.అయితే ఇప్పుడు చెప్పబోయే టేస్టీ అండ్ హెల్తీ స్మూతీని బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటే అతి ఆకలి, అధిక బరువు రెండు కంట్రోల్ అవుతాయి.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ స్మూతీ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఎండు ద్రాక్ష, పావు టేబుల్ స్పూన్ కుంకుమపువ్వు, ఒక కప్పు వాటర్ వేసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలి.
మరుసటి రోజు ఉదయాన్నే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక చిన్న కప్పు పూల్ మఖానా(తామర గింజలు) వేసి వేయించుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో వేయించి పెట్టుకున్న తామర గింజలను వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు, వన్ టేబుల్ స్పూన్ పొద్దు తిరుగుడు గింజలు, వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు వేసుకోవాలి.మరియు ఒక గ్లాస్ బాదం పాలు, వన్ టేబుల్ స్పూన్ పీనట బటర్ మరియు నానబెట్టుకున్న ఎండు ద్రాక్ష కుంకుమపువ్వును వాటర్ తో సహా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మన స్మూతీ సిద్ధం అవుతుంది.
టేస్టీ అండ్ హెల్తీ స్మూతీని బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకుంటే ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావన కలుగుతుంది.అతి ఆకలి దూరం అవుతుంది.దాంతో చిరు తిండ్లపై మనసు మళ్లకుండ ఉంటుంది.అలాగే ఈ స్మూతీని తీసుకోవడం వల్ల మెటబాలిజం రేటు పెరుగుతుంది.ఫలితంగా అధిక బరువు క్రమంగా అదుపులోకి వస్తుంది.ఈ స్మూతీని తీసుకోవడం వల్ల ఎముకలు కండరాలు దృఢంగా మారతాయి.
మెదడు సైతం మునుపటికంటే చురుగ్గా మరియు వేగంగా పనిచేస్తుంది.