జగన్ కు ఇబ్బందులు తప్పవా ? ఆ పార్టీతో ఇక తలనొప్పులు తప్పవా ?

ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి కేంద్ర అధికార పార్టీ బిజెపి అన్ని రకాలుగానూ సహకరిస్తోంది.

రాష్ట్రంలో బిజెపి ఏపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నా, కేంద్ర బిజెపి పెద్దలు మాత్రం అనేక విషయాల్లో జగన్ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు.

అడిగిన వెంటనే నిధులను సమకూర్చుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు.కేంద్రం సహకారంతోనే ఈ స్థాయిలో జగన్ ప్రజా సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేయగలుగుతున్నారు.

అలాగే కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధుల విషయంలోనూ సానుకూలంగానే స్పందిస్తున్నారు.పక్కనే ఉన్న తెలంగాణ తో పోల్చుకుంటే ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి బీజేపీ సహకారం ఎప్పటికప్పుడు అందుతూనే ఉంది.

దీని కారణంగానే జగన్ ఎక్కడా వెనుకడుగు వేయకుండా ఏపీలో వైసీపీ ప్రభుత్వ ఇమేజ్ ను పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు.వైసీపీకి చెందిన 22 మంది ఎంపీలు కేంద్రం ప్రవేశపెడుతున్న వివిధ బిల్లులకు ,కీలకమైన నిర్ణయాల విషయంలోనూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా ఓటింగ్ లో పాల్గొంటున్నారు.

Advertisement
Is Jagan In Trouble Except For More Headaches With That Party , Jagan, Ap Cm Jag

ఈ విషయంలో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.అయినా జగన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

అయితే రాబోయే రోజుల్లో బీజేపీ సహకారం జగన్ కు ఎంత వరకు ఉంటుంది అనేది ప్రశ్నగా మారింది.ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కనుక అభ్యర్థిని నిలబెడితే వైసీపీ ఎంపీల ఓట్లు కీలకమవుతాయి.ఈ విషయాన్ని కేంద్ర అధికార పార్టీ బిజెపి గుర్తించింది.

ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి ఎన్నికల వరకు వైసిపి సహకారం తీసుకుంటూ , ఏపీ ప్రభుత్వానికి సహకరిస్తూ వచ్చినా , రాష్ట్రపతి ఎన్నికలు ముగిసిన తర్వాత మాత్రం వైసీపీకి కేంద్రంతో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Is Jagan In Trouble Except For More Headaches With That Party , Jagan, Ap Cm Jag
ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..

ప్రస్తుతం ఏపీలో బీజేపీ , జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి.ఈ మధ్యకాలంలో జనసేన గ్రాఫ్ కూడా పెరగడంతో రాబోయే ఎన్నికల్లో వైసీపీని ప్రధాన ప్రత్యర్థిగా చూస్తూ విమర్శలు చేయడమే కాకుండా, కేంద్రం నుంచి సహకారం నిలిపివేస్తేనే వైసీపీని ప్రత్యర్థిగా బీజేపీ చూస్తోంది అనే సంకేతాలు అటు జనసేన కేడర్ కి, ఇటు ప్రజలకు ఇచ్చినట్టు అవుతుంది అనే లెక్కలు బీజేపీ పెద్దలు ఉన్నారట.ఈ నేపథ్యంలోనే ఆగస్టు తర్వాత వైసీపీకి రాజకీయంగా బీజేపీతో కొత్త తలనొప్పులు తప్పవు అనే విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు