హైదరాబాద్ ఎస్ఆర్ నగర్‎లో నగలు చోరీపై దర్యాప్తు ముమ్మరం

హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో నగలు చోరీ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఈ క్రమంలో నగలు తీసుకుని పరారైన డ్రైవర్ శ్రీనివాస్ కోసం పోలీసులు ఐదు బృందాలుగా గాలిస్తున్నారు.

కాగా నిన్న మధురానగర్ లో బంగారం డెలివరీ ఇచ్చేందుకు ఎగ్జిక్యూటివ్, డ్రైవర్ లు వెళ్లిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఎగ్జిక్యూటివ్ వచ్చే లోగా కారు, నగలతో డ్రైవర్ ఉడాయించాడు.

కాగా బంగారం వ్యాపారి రాధిక దగ్గర శ్రీనివాస్ రెండు నెలల క్రితం డ్రైవర్ గా చేరాడని తెలుస్తోంది.కాగా శ్రీనివాస్ రాజమండ్రికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

అదేవిధంగా నగలు అపహరించిన తరువాత విజయవాడ రూట్ లో శ్రీనివాస్ కారు వెళ్లినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
అమ్మమ్మ చీర కట్టుకోవాలని ఉంది...ఆ రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను : సాయి పల్లవి

తాజా వార్తలు