నాంపల్లి అగ్నిప్రమాద ఘటనపై ముమ్మర దర్యాప్తు

హైదరాబాద్ నాంపల్లి అగ్నిప్రమాద ఘటనపై ముమ్మర దర్యాప్తు జరుగుతోంది.బజార్ ఘాట్ లోని కెమికల్ గోదాంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది.

మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారని తెలుస్తోంది.గ్రౌండ్ ఫ్లోర్ లో చెలరేగిన మంటలు భారీగా ఎగిసిపడ్డాయి.

Investigation Into The Nampally Fire Incident-నాంపల్లి అగ్

ఈ క్రమంలో నాలుగు అంతస్థుల వరకు మంటలతో పాటు దట్టమైన పొగ వ్యాపించింది.దీంతో మంటల్లో చిక్కుకుని కొందరు, పొగతో ఊపిరాడక మరి కొందరు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు.

కాగా ఈ ప్రమాదంలో 18 మందికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.అపార్ట్ మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లో అక్రమంగా నిల్వచేసిన కెమికల్ డబ్బాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Advertisement
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి12, బుధవారం 2025

తాజా వార్తలు