ఆటోలో వెళ్లి ఛాన్స్ ఇవ్వాలని ఆ నిర్మాతను అడిగిన ఎన్టీఆర్.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించి త్వరలో తర్వాత సినిమాల షూటింగ్ లతో బిజీ కానున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ నుంచి తాజాగా గ్లింప్స్ విడుదల కాగా ఈ గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

"అప్పుడప్పుడూ ధైర్యానికి కూడా తెలీదు అవసరానికి మించి తను ఉండకూడదని.అప్పుడు భయానికి తెలియాలి తను రావాల్సిన సమయం వచ్చిందని.

వస్తున్నా" అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచింది.అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండగా ఈ సినిమాలో హీరోయిన్, రిలీజ్ డేట్ కు సంబంధించి మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు.

ఐదు భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుండగా మలయాళం మినహా మిగతా భాషల్లో ఎన్టీఆర్ స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం గమనార్హం.అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈ స్థాయికి చేరుకోవడానికి పడిన కష్టం అంతాఇంతా కాదు.

Advertisement

కెరీర్ తొలినాళ్లలోనే సినిమాలు హిట్టైనా ఫ్లాపైనా ఇండస్ట్రీలో ఉంటానని చెప్పి తారక్ కెరీర్ ను మొదలుపెట్టారు.బ్రహ్మర్షి విశ్వామిత్ర జూనియర్ ఎన్టీఆర్ తొలి సినిమా కాగా బాల రామాయణం రెండో సినిమా కావడం గమనార్హం.

బాల రామాయణం సినిమాలో ఛాన్స్ కావాలని చిన్న వయస్సులోనే జూనియర్ ఎన్టీఆర్ నిర్మాత ఎం.ఎస్.రెడ్డిని కలిసి అడగటం గమనార్హం.స్కూల్ నుంచి ఆటోలో మల్లెమాల స్టూడియోస్ కు వెళ్లి తన గురించి చెప్పడంతో పాటు రాముడి పాత్ర కావాలని జూనియర్ ఎన్టీఆర్ ఎం.ఎస్.రెడ్డిని అడిగారు.

ఆ తర్వాత హరికృష్ణ కూడా ఎం.ఎస్.రెడ్డితో మాట్లాడారు.అలా బాల రామాయణంలో ఎన్టీఆర్ కు ఛాన్స్ దక్కింది.

బాల రామాయణం కమర్షియల్ రిజల్ట్ ఎలా ఉన్నా నటుడిగా ఎన్టీఆర్ కు మాత్రం మంచి పేరు వచ్చింది.ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగిన ఎన్టీఆర్ ప్రస్తుతం కోట్ల సంఖ్యలో అభిమానులకు ఫేవరెట్ హీరోగా మారారు.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తర్వాత సినిమాలతో కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్లు సాధిస్తారని ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు