అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం తన ఉనికిని చాటుకునే పనిలో ఉన్నారు.ఎప్పుడూ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు దగ్గరగా ఉండే ట్రంప్ ప్రస్తుతం సోషల్ మీడియాలు తనపై విధించిన బ్యాన్ కారణంగా ఏం చేయాలో పాలుపోక తల పట్టుకుంటున్నాడు.
బిడెన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడానికి మీడియా ఉన్నా సరే విస్తృతంగా ప్రచారమయ్యే సోషల్ మీడియాలో తన పాత్ర లేదే అనే బెంగ ట్రంప్ లో స్పష్టంగా కనిపిస్తోంది.ట్విట్టర్, పేస్ బుక్ ఇలా అన్ని సోషల్ మీడియాలు తనపై బ్యాన్ విధించాయనే కసితో సొంతగా ట్రూత్ సోషల్ మీడియా ను ఏర్పాటు చేసుకున్నారు కూడా…అయితే
క్యాపిటల్ హిల్ పై దాడి ఘటన తరువాత యావత్ ప్రపంచం ట్రంప్ పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయగా సోషల్ మీడియా దిగ్గజాలన్నీ ట్రంప్ ని బ్యాన్ చేయడంతో పరువు పోగొట్టుకున్నాడు ట్రంప్.
కానీ తనకేమాత్రం సిగ్గు లేదంటూ మధ్య మధ్యలో ఫేక్ ఎకౌంటు లతో ఎంట్రీ ఇచ్చినా వాటిని కనిపెట్టిన ట్విట్టర్ టీమ్ ఫేక్ ఎకౌంటు లను తొలగిస్తూ వచ్చేది.కానీ గజనీ మహ్మద్ దండయాత్ర లా ట్రంప్ మళ్ళీ మళ్ళీ ట్విట్టర్ ఖాతాలో తన ఫోటో లు వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉన్నాడు.
తాజాగా @PresTrumpTs అనే పేరుతో ట్విట్టర్ లో వరుసగా ట్వీట్ లు చేస్తున్నారు ట్రంప్.మొదట్లో ట్విట్టర్ విషయాన్ని గమనించలేక పోయింది.కానీ ఆ యూజర్ పేరుతో సుమారు 300 లకు పైగా ట్రంప్ కు చెందిన ట్వీట్ లు హల్చల్ చేయడంతో ఆ ఎకౌంటు ను పరిశీలించింది ట్విట్టర్ టీమ్ ఆ తరువాత వారి పరిశోధనలో తేలిందేంటంటే.ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలోని ఆయన ఎకౌంటు లో ఉన్న అన్ని పోస్ట్ లు ట్విట్టర్ లో డంప్ చేస్తున్నారు.
దాంతో ఈ ఫేక్ ఎకౌంటు ను కూడా బ్లాక్ చేసింది ట్విట్టర్.కాగా ట్రంప్ చేస్తున్న ఈ దొంగ చాటు పనులకు సోషల్ మీడియా యూజర్స్ కొందరు తిట్టిపోస్తున్నారు.
మీరు మాజీ అధ్యక్షుడు అనే విషయం మరిచిపోయి చీప్ ట్రిక్స్ చేస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.